దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఎంగేజ్మెంట్.. వేలికి ఉంగరాలు తొడిగి.. నెట్టింట వీడియో హల్ చల్..

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-17 17:54:14  IST  )

దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి టాపిక్ అంటేనే ఎక్కడలేని అటెన్షన్ వస్తుంది జనాలకు. అలాగని పాజిటివ్‌గానా అంటే అదీ కాదు.. ట్రోల్ చేయడానికే కాచుకు కూర్చుని ఉండేవారు లక్షల్లో ఉండొచ్చు. ఇలా టార్గెట్ చేయడంలో కూడా తప్పేమీ లేదనేది వారి వాదన

దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఎంగేజ్మెంట్.. వేలికి ఉంగరాలు తొడిగి.. నెట్టింట వీడియో హల్ చల్..
X

దిశ, ఫీచర్స్ : దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి టాపిక్ అంటేనే ఎక్కడలేని అటెన్షన్ వస్తుంది జనాలకు. అలాగని పాజిటివ్‌గానా అంటే అదీ కాదు.. ట్రోల్ చేయడానికే కాచుకు కూర్చుని ఉండేవారు లక్షల్లో ఉండొచ్చు. ఇలా టార్గెట్ చేయడంలో కూడా తప్పేమీ లేదనేది వారి వాదన. పెళ్లి కాకముందే ఒక్కటైన వీరిద్దరు.. అమర ప్రేమికుల మాదిరిగా ఇంటర్వ్యూలు ఇవ్వడం.. అవి కాస్త వైరల్ కావడం చూస్తూనే ఉంటాం. అంతెందుకు ఉగాది పండుగ సందర్భంగా ఈ జంటను పిలిచి సత్కారం చేసినవాళ్లు కొందరు అయితే ప్రేమికుల రోజున ప్రత్యేక ఇంటర్వ్యూలు తీసుకున్నవాళ్లు ఇంకొందరు. అక్కడే ముద్దులు పెట్టుకోవడం కూడా చేయించారు.

ఇప్పటి వరకు ఇదంతా జరిగితే కొత్తగా వీరికి సంబంధించిన మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దువ్వాడ శ్రీనివాస్.. దివ్వెల మాధురికి కాస్ట్‌లీ రింగ్ వేలికి తొడిగిన వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇది చూసిన నెటిజన్లు.. దువ్వాడ, దివ్వెలకు ఎంగేజ్మెంట్ అయిందా ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనని ఇరిటేట్ అవుతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు వీరి వీడియోలే రావడంతో విసిగిపోతున్నామని తిట్టిపోస్తున్నారు.

Next Story