ఏం తాగినవ్.. మందు తాగిన! పోలీసులను ఆటాడుకున్న మందుబాబు

by Sujitha Rachapalli |

ఓ మందుబాబు పోలీసులతోనే వాగ్వాదానికి దిగాడు. నా జేబుల డబ్బులతో తాగుతన్నా మీకేంది అంటూ రెచ్చిపోయాడు. ఘట్కేసర్‌కు చెందిన 22 ఏళ్ల యవకుడు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. ఏం తాగినవ్ అంటే మందు తాగినా.. బరా బర్ మందు తాగిన అని సమాధానమిచ్చాడు.

ఏం తాగినవ్.. మందు తాగిన! పోలీసులను ఆటాడుకున్న మందుబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ మందుబాబు పోలీసులతోనే వాగ్వాదానికి దిగాడు. నా జేబుల డబ్బులతో తాగుతన్నా మీకేంది అంటూ రెచ్చిపోయాడు. ఘట్కేసర్‌కు చెందిన 22 ఏళ్ల యవకుడు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. ఏం తాగినవ్ అంటే మందు తాగినా.. బరా బర్ మందు తాగిన అని సమాధానమిచ్చాడు. ఫైన్ కట్టాలా.. ఫోన్‌లా చూసుకుని కట్టుకుంటా.. పైసల్ ఎన్నైనా కడుతా.. బాధేమీ లేదంటూ మద్యం మత్తులో రెచ్చిపోయాడు. రోడ్డు మీద ఉమ్మొద్దు అంటే అబ్బో రూల్ అంటూ వెటకారంగా మాట్లాడాడు. తనది గవర్నమెంట్ జాబ్ అని.. ఫ్రెండ్ ఆటో నడుపుతాడని.. ఈ బైక్ అతనిదేనని చెప్పుకొచ్చాడు. నాకేం భయం లేదు.. ఫొటోలు చెకింగ్‌లతో భయపెట్టాలని చూస్తున్నారా.. నేనేమైనా అడ్డగోలు స్పీడ్ పోయిన్నా.. నిమ్మలంగా పోయినా.. నాకు ఫ్యామిలీ ఉంది.. నాకు తెల్వదా ఎట్ల పోవన్నో అంటూ పోలీసులకే క్లాస్ ఇచ్చాడు.

Next Story