"మందుబాబులా మజాకా"... బీర్లు కూల్ గా ఉండేందుకు ఏం చేశారో చూడండి..!

by velandi.Saikiran |

పైప్ ద్వారా.. ఐసు ముక్కలను మొత్తం ఆ బీర్లపై చల్లేశారు. దాదాపు 200 బీర్లు ఆ ట్రక్కులో ఉన్నాయి. వాడికి సరిపడా ఐస్ ముక్కలు

మందుబాబులా మజాకా... బీర్లు కూల్ గా ఉండేందుకు ఏం చేశారో చూడండి..!
X

దిశ, వెబ్ డెస్క్ : మందు బాబులకు ఉన్న తెలివి మరొకరికి ఉండదని చాలామంది చెబుతూ ఉంటారు. చుక్క మందు కోసం.. మందుబాబులు ఏ పనైనా చేస్తారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కొందరు మందుబాబులు చేసిన పని అందరికీ నవ్వు తెప్పిస్తుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆఫ్రికన్ కంట్రీ లో జరిగిన వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రకారం.. ఓ ట్రక్కు నిండా విదేశీ బీర్లను నింపేశారు. అయితే బీర్లు కచ్చితంగా కూలింగ్ ఉండాల్సిందే. లేకపోతే మందుబాబులు అస్సలు తాగలేరు. అయితే దాని కోసం ప్రత్యేకంగా ఆలోచన చేశారు.

ఆ ట్రక్కును ఐస్ దొరికే దుకాణానికే తీసుకువెళ్లారు. అక్కడ ఓ పైప్ ద్వారా.. ఐసు ముక్కలను మొత్తం ఆ బీర్లపై చల్లేశారు. దాదాపు 200 బీర్లు ఆ ట్రక్కులో ఉన్నాయి. వాడికి సరిపడా ఐస్ ముక్కలు చల్లి... ట్రక్కును తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మందుబాబులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు కేవలం మందుబాబులకే వస్తాయని సెటైర్లు పేల్చుతున్నారు.

Instagramme Link






Next Story