కన్నీరు పెట్టుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వీడియో వైరల్

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-20 12:49:28  IST  )

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ విషెస్ చెప్పారు. అయితే అంధ విద్యార్థులు బర్త్ డే విషెస్ పాట రూపంలో చెప్తుండగా ఆమె ఎమోషనల్ అయిపోయారు

కన్నీరు పెట్టుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌సైట్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ విషెస్ చెప్పారు. అయితే అంధ విద్యార్థులు బర్త్ డే విషెస్ పాట రూపంలో చెప్తుండగా ఆమె ఎమోషనల్ అయిపోయారు. కన్నీరు పెట్టుకున్నారు. ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న ద్రౌపది ముర్ము.. డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ పరిధిలోని ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజిబుల్ డిజెబిలిటీస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కళ్లజోళ్లు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ప్యూర్ హార్టెడ్ అని.. నిజంగా బ్యూటీఫుల్ మూమెంట్ అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story