Viral News: కుక్కకి సీమంతం.. హాజరైన బంధుగణం

by Disha Web Desk 3 |
Viral News: కుక్కకి సీమంతం.. హాజరైన బంధుగణం
X

దిశ డైనమిక్ బ్యూరో: జంతు ప్రేమికులు సాధారణంగా తాము పెంచుకునే జంతువుల పట్ల ప్రేమని కలిగి ఉంటారు. ఆ జంతువులకు అవసరమైన ఆహారాన్ని అందిస్తారు. అనారోగ్యం ధరి చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక చెప్పాలంటే వాటితో ఆడుకుంటారు. మరి ప్రేమ ఎక్కువైన వాళ్ళు ఆ జంతువులకు పుట్టినరోజులు కూడా నిర్వహిస్తారు. ఇలా జంతువులను ప్రేమాగా చూసుకుంటూ, వాటికి పుట్టిన రోజు వేడుకలు నిరవహించి ఆ ఫోటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటనలు కోకొల్లలు.

అయితే తాజాగా ఓ కుటుంబం వాళ్ళు పెంచుకుంటున్న కుక్కకి సీమంతం చేశారు. ఈ వింత ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలో ఓ కుటుంబం వాళ్ళు పెంచుకుంటున్న పెంపుడు కుక్కకి అంగరంగ వైభవంగా సీమంతం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు బంధువులను కూడా ఆహ్వానించారు. ఇక ఆహ్వానం అందుకున్న 50 మంది బంధువులు కుక్క సీమంతానికి విచ్చేసారు.

కాగా ఈ సీమంతానికి సంబంధించిన ఫోటలను, వీడియో లను ఆ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనితో ప్రస్తుతం ఆ వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఆ కుక్క సీమంతం వీడియోని మీరు ఓ సారి చూసేయండి.



Next Story

Most Viewed