Viral Post : అవి టాబ్లెట్స్ అనుకుంటున్నారా? చాక్లెట్స్ అనుకుంటున్నారా? డాక్టర్ ట్వీట్ వైరల్

by Muthe.Rajitha |   (  Updated:2025-04-17 03:37:24  IST  )

కరోనా(Covid -19) తర్వాత జనాలు టాబ్లెట్స్ ను పిప్పరమెంట్ బిళ్ళలా తింటున్నారని ఓ డాక్టర్ ఆవేదన చెందిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Post : అవి టాబ్లెట్స్ అనుకుంటున్నారా? చాక్లెట్స్ అనుకుంటున్నారా? డాక్టర్ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా(Covid -19) తర్వాత జనాలు టాబ్లెట్స్ ను పిప్పరమెంట్ బిళ్ళలా తింటున్నారని ఓ డాక్టర్ ఆవేదన చెందిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించిన కాలంలో ప్రజల్లో బాగా పాపులర్ అయిన మెడిసిన్ డోలో 650(Dolo 650). ఆయుతే దీని వాడకంపై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ డాక్టర్ పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్(Doctor Post on dolo 650) అవుతోంది. పళనియప్పం మాణిక్కం అనే డాక్టర్.. భారతీయులు భారతీయులు డోలో 650ని క్యాడ్బరీ చాక్లెట్లలా తీసుకుంటున్నారని తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. తమ ఇళ్ళల్లో ఈ టాబ్లెట్స్ షీట్లు స్టాక్ పెట్టుకుంటామని బదులిస్తున్నారు నెటిజన్స్. దేశీయంగా పారాసిటమాల్ బ్రాండ్లు అనేకం ఉన్నప్పటికీ బెంగుళూరులోని మైక్రోల్యాబ్స్ తయారు చేసే డోలో 650 కే అధిక డిమాండ్ ఉంటుంది. అయితే దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణాశయ, గుండె, కిడ్నీ సమస్యలు పెరుగుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Next Story