Valentine's Day.. మాజీ ప్రియుడికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన యువతి.. ఏం చేసిందో తెలుసా?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-18 12:19:15  IST  )

ప్రేమ.. రెండు అక్షరాల పదం. రెండు హృదయాల కలయిక. అయితే ఇటీవల కాలంలో యువతీయువకులు ఎంత తొందరగా ప్రేమలో పడుతున్నారో..

Valentines Day.. మాజీ ప్రియుడికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన యువతి.. ఏం చేసిందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రేమ.. రెండు అక్షరాల పదం. రెండు హృదయాల కలయిక. అయితే ఇటీవల కాలంలో యువతీయువకులు ఎంత తొందరగా ప్రేమలో పడుతున్నారో.. అంతే తొందరగా విడిపోతున్నారు. ఒకప్పుడు ప్రేమికులు తమ ప్రేమకు ఎంతో విలువ ఇచ్చేవారు. కానీ, ఇప్పటి ప్రేమికులు అలా లేరు. చిన్న చిన్న మనస్పర్థాలకే దూరమవుతున్నారు. పైగా ఒకరిపై ఒకరు రివేంజ్‌లు ప్లాన్ చేసుకుని పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటననే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువతిని తన బాయ్ ఫ్రెండ్ వదిలేశాడు. దీంతో అతనిపై ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంది. వాలంటైన్స్ డే సందర్భంగా మాజీ బాయ్ ఫ్రెండ్‌పై షాకింగ్ రివేంజ్ ప్లాన్ చేసింది.

ఇంతకీ ఏం చేసిందంటే.. ఓ యువతి, యష్ అనే యువకుడు కొంతకాలం ప్రేమించుకున్నారు. అయితే, ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో బ్రేక్ చెప్పుకుని విడిపోయారు. ఈ నేపథ్యంలో అతడిపై రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంది. ఈక్రమంలో ప్రేమికుల రోజు సందర్భంగా తన మాజీ ప్రియుడికి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. వాలంటైన్ డే స్పెషల్‌గా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 100 పిజ్జాలు ఆర్డర్ చేసింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ పిజ్జాలకు ఆ యువతి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టింది. డెలివరీ బాయ్ పిజ్జాలు తీసుకుని వచ్చి ఇంటి ముందు పెట్టి యష్‌ను డబ్బులు పే చేయమని అడగటంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే తాను ఆర్డర్ చేయలేదని, బిల్లు కట్టే ప్రసక్తే లేదని గొడవపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.

Next Story