Viral Video : నడిరోడ్డుపై భర్తను చితక్కొట్టిన భార్య.. పిడిగుద్దులు గుద్ది, కొరికి, గొంతు పిసికి రచ్చ రచ్చ.. చూస్తూ ఉండిపోయిన జనాలు.. కానీ తర్వాత..

by Sujitha Rachapalli |

ఈ మధ్య భార్యాభర్తల వివాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. ఈ మధ్య భార్యను నడిరోడ్డు మీద భర్త కాల్చి చంపేసి.. శవం పక్కనే కూర్చున్న వీడియో ట్రెండ్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా భార్య భర్తను నడిరోడ్డు

Viral Video : నడిరోడ్డుపై భర్తను చితక్కొట్టిన భార్య.. పిడిగుద్దులు గుద్ది, కొరికి, గొంతు పిసికి రచ్చ రచ్చ.. చూస్తూ ఉండిపోయిన జనాలు.. కానీ తర్వాత..
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య భార్యాభర్తల వివాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. రీసెంట్‌గా భార్యను నడిరోడ్డు మీద భర్త కాల్చి చంపేసి.. శవం పక్కనే కూర్చున్న వీడియో ట్రెండ్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా భార్య భర్తను నడిరోడ్డు మీద చితక్కొట్టిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సివిల్ లైన్స్ పీఎస్ పరిధిలో ఉన్న ఎండీఏ కార్యాలయం ఎదుట పెద్ద గొడవే జరిగింది. ఉన్నట్లుండి కారులో నుంచి దిగిన భార్య.. భర్తను పిడిగుద్దులు గుద్ది, కొరికి, బూతులు తిడుతూ.. అరగంట సేపు రచ్చరచ్చ చేసింది. కానీ ఏ ఒక్కరు కూడా అడ్డుకునేందుకు సాహసించలేదు. జస్ట్ ప్రేక్షకుల మాదిరిగా చూస్తూ ఉండిపోయారు. అయితే ఘటనాస్థలికి చేరుకున్న లేడీ పోలీస్ ఆఫీసర్.. భార్యను ఆపి, శాంతింపజేసింది. ఆ తర్వాత ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. అయితే ఈ గొడవకు గల కారణాలేంటో తెలియాల్సి ఉంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. నారీ శక్తి అంటే ఇదేనా అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

VIDEO

Next Story