- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video: కోబ్రా ప్రాణాయామం చేస్తే..?! ఒళ్లు గగ్గురుపొడిచే వీడియో
ఈ వీడియోలో కోబ్రా చాలా దగ్గరగా కనిపిస్తుంది. Cobra snake performing Pranayama, which astonishes everybody. Viral Video

Viral Video
దిశ, వెబ్‌డెస్క్ః ప్రాణాయామం ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. దీని వల్ల శరీరం నుండి విషకారకాలు బయటకు వెళ్లిపోయి, శరీరంలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. అయితే, విష సర్పాలే ప్రాణాయాయం చేస్తే..?! అవును, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటైన కోబ్రా ప్రాణాయామం చేస్తోంది. కోబ్రాను చూస్తేనే ఒన్నులో వణుకుపడుతుంది. అయితే, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ డాక్టర్ ఎస్ వరప్రసాద్ తీసిన ఈ వీడియోలో కోబ్రా చాలా దగ్గరగా కనిపిస్తుంది, పాము శ్వాస ఎంతో స్పష్టంగా వినిపిస్తుంది. ప్రాణాయామంలో గట్టిగా గాలి పీల్చుకొని నెమ్మదిగా వదులుతుంటాము. అప్పుడు మన ఛాతి ఎలా అవుతుందో అలాగే, శ్వాసతో వ్యాయామం చేస్తున్నకోబ్రా శరీరం కూడా నిశ్వాసలో సన్నగా, ఉచ్ఛ్వాసకు ఉబ్బుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో చూస్తుంటే ఒళ్లు గగ్గర్లుపెడుతుంది. ఇక, మొదటి లుక్‌లో పాము భరించలేని కోపంతో కూడా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ, ఆనక, ఇది నిజంగానే ప్రాణాయామం చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ షాకింగ్ వీడియోను మేఘనా గిరీష్ ట్విట్టర్‌లో పంచుకున్నారు.






