తెర‌పైకి 'సిగరెట్ వాలే బాబా'... డ‌బ్బులు జ‌ల్లుతూ జ‌నాల ర‌చ్చ‌ !

by velandi.Saikiran |

ఓ కుర్రాడు సిగ‌రేట్ తాగుతూ ప‌బ్లిక్ ప్లేస్ ర‌చ్చ చేసిన వీడియో వైర‌ల్ గా మారింది.

తెర‌పైకి సిగరెట్ వాలే బాబా... డ‌బ్బులు జ‌ల్లుతూ జ‌నాల ర‌చ్చ‌ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మన ఇండియాలో దొంగ బాబాలు చాలా మంది ఉన్నారు. మాయలు చేసి జనాల డబ్బులను దోచుకుంటున్నారు. దొంగ బాబాలు ఎంతో మంది తెరపైకి వచ్చిన కూడా, జనాలు మోసపోతునే ఉన్నారు. అయితే లేటెస్ట్ గా ఓ సిగరెట్ వాలే బాబా తెరపైకి వచ్చాడు. దాదాపు 14 సంవత్సరాల ఓ మైనర్ బాలుడు సిగిరెట్ తాగుతూ వైరల్ గా మారాడు. దీంతో అతడు సిగిరెట్ వాలే బాబా అంటూ జనాలు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అంతేకాదు అతనికి డబ్బులు వేస్తూ తమ కోరికలు తీర్చాలంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

సిగరెట్లు తాగుతూ బాలుడు ర‌చ్చ

గుజరాత్ లోని మోర్బి ప్రాంతంలో ఓ మైనర్ బాలుడు, సిగరెట్లు తాగుతూ గాల్లోకి పొగలు ఊదడం మొదలు పెట్టాడు. బహిరంగ ప్రదేశంలోనే కుర్రాడు విపరీతంగా సిగరెట్లు తాగిన సంఘ‌ట‌న స్థానికంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో ఆ కుర్రాడిని సిగరెట్ వాలే బాబా అంటూ స్థానికులు ప్రచారం కూడా మొదలుపెట్టారు. భ‌గ‌వంతుని స్వ‌రూపం అని న‌మ్మ‌బ‌లికారు. బ‌హిరంగంగా సిగ‌రేట్ కాల్చే ఆ కుర్రాడిని మందలించాల్సింది పోయి, బాబా అంటూ దండాలు పెట్టడం షురూ చేశారు. ఆ బాబాకు డబ్బులు వేసి కోరికలు కోరితే, అనుకున్నది సాధిస్తామని పిచ్చి నమ్మకాన్ని అందరూ నమ్మేలా చేశారు. అంతేకాదు ఈ కుర్రాడిని చూసేందుకు వచ్చే జనాలకు టెంట్లు, మంచినీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఇంత త‌తంగం జ‌రుగుతున్నా, పోలీసులు మాత్రం ఇంకా చ‌ర్య‌లు తీసుకోలేదు. ఇక ఈ సంఘ‌ట‌న వైర‌ల్ అయిన త‌రుణంలో వెంట‌నే ఆ బాలుడిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజెన్స్ పోస్టులు పెడుతున్నారు. క్లిక్

Next Story