- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నాటకలో చైనా స్పై పక్షి కలకలం.. ఏకంగా GPS ట్రాకర్ లభ్యం
పొరుగు దేశం చైనా (China) అవకాశం దొరికినప్పుడల్లా మన దేశంపై విషం చిమ్ముతూనే ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: పొరుగు దేశం చైనా (China) అవకాశం దొరికినప్పుడల్లా మన దేశంపై విషం చిమ్ముతూనే ఉంది. వ్యూహాత్మక ప్రాంతాల్లో వరుసగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే వస్తుంది. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ (Galwan) ఘటన తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఒకానొక దశలో తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అదేవిధంగా సమస్యాత్మక సరిహద్దు ప్రాంతాల్లో కాలనీలు ఏర్పాటు చేయడం, అరుణాచల్ ప్రదేశ్‌ను వారి మ్యాప్‌లలో తమ భూభాగంలో చూపించడం లాంటి సిగ్గుమాలిన చర్యలకు చైనా పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తాజాగా కర్ణాటకలో చైనాకు ఓ స్పై పక్షి కలకలం రేపుతోంది. ఉత్తర కన్నడ జిల్లా కార్వార్ (Karwar)లోని ఠాగూర్ బీచ్‌లో కదలలేని స్థితిలో సీగల్ పక్షిని స్థానికులు గుర్తించారు. అనంతరం కోస్టల్ పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు స్పాట్‌కు చేరుకుని సీగల్ పక్షి (Seagull Bird)ను స్వాధీనం చేసుకున్నారు. పక్షి పైభాగంలో సోలార్ ప్యానెల్ (Solar Panel) అటాచ్ చేసి ఉన్న జీపీఎస్ ట్రాకర్ (GPS Tracker)ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ ట్రాకర్‌లో తమ పక్షి ఎవరికైనా దొరికితే మెయిల్ చేయాలంటూ చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన సందేశం ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో వివరణ కోసం ఆ మెయిల్ ఐడీని పోలీసులు, అధికారులు కాంటాక్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఉత్తర కನ್ನడ జిల్లా ఎస్పీ వెల్లడించడం హాట్ టాపిక్‌గా మారింది.






