ఈ మందుబాబు కష్టాలు ఎవరికీ రాకూడదు.. బీర్లు ఇలా కూడా పగులుతాయా !

by velandi.Saikiran |

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని.. ఎవరు ఊహించని

ఈ మందుబాబు కష్టాలు ఎవరికీ రాకూడదు.. బీర్లు ఇలా కూడా పగులుతాయా !
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని.. ఎవరు ఊహించని విధంగా చాలా క్రూరంగా కూడా ఉంటాయి. ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిన కొద్దీ సోషల్ మీడియాలో కూడా రకరకాల వీడియోలు.. ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బీర్లు ఫ్రిడ్జ్ లో పెట్టిన వీడియో వైరల్ గా మారింది.

ఓ మందు బాబు.. ఒకేసారి నాలుగు బీర్లు ఫ్రిడ్జ్ లో పెట్టాడు. చిల్డ్ అయ్యాక ఒకేసారి తాగేద్దామని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే రిఫ్రిజిరేటర్ స్పీడును ఐదు పాయింట్లకు పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే.. డీ- ఫ్రిడ్జ్ లో ఉన్న.. బీర్లు మొత్తం గడ్డ కట్టేసాయి. అందులో ఉన్న బీర్లన్నీ.. పగిలిపోయి.. సీసాలు మాత్రమే మిగిలాయి. ఇక దీనికి సంబంధించిన వీడియోను ఆ మందుబాబు క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశాడు.

చల్లటి బీర్లు తాగుదామని ఫ్రిడ్జ్ లో పెడితే... నా పరిస్థితి ఇలా అయిందంటూ.. తన బాధను ఈ వీడియో ద్వారా పంచుకున్నాడు. సాధారణంగా మందుబాబుల వీడియోలు అంటే క్షణాల్లోనే వైరల్ అవుతాయి. అలాంటిది మందుబాబుకు అన్యాయం జరిగిన వీడియోను... జనాలు ఎగబడి చూస్తారు. ఈ నేపథ్యంలోనే బీర్లు పగిలిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్... తమ స్టైల్ లో స్పందిస్తున్నారు. ఇలాంటి బాధ.. ఏ మందు బాబుకు రాకూడదని కామెంట్స్ పెడుతున్నారు.

Next Story