- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టోల్ గేట్ డబ్బులు అడిగితే.. ఇలా ప్రవర్తించాలా? ( వీడియో)
ఉత్తరప్రదేశ్‌లో టోల్ గేట్ వద్ద డబ్బులు అడిగినందుకు కారుతో ఢీ కొట్టిన ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో టోల్ గేట్ వద్ద డబ్బులు అడిగినందుకు కారుతో ఢీ కొట్టిన ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టోల్ ప్లాజా మేనేజర్ చెప్పిన ప్రకారం.. సోమవారం సాయంత్రం ఢిల్లీ- మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న కాశీ టోల్ ప్లాజా ఢిల్లీ నుంచి వస్తున్న ఓ కారుకు ఫాస్టాగ్ లేకపోవడంతో డబ్బులు చెల్లించాలని సిబ్బంది కారు డ్రైవర్‌ను అడిగారు. ఈ క్రమంలోనే కారు డ్రైవర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అంతే కాకుండా దుర్భాషలాడుతూ ముందు నిల్చున్న మహిళని కారుతో ఢీ కొట్టి వెళ్లిపోయాడు.
ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. టోల్ ప్లాజా మేనేజర్ అనిల్ శర్మ కారు డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని గుర్తించడానికి టోల్ బూత్ నుంచి సీసీటీవీ ఫుటేజీని తెప్పించుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






