బురఖా వేసుకున్నా భద్రత లేదు.. కిస్ ఇచ్చి యువకుడు రచ్చ !

by velandi.Saikiran |

దేశంలో ఏ మూలన చూసినా మహిళలపై ( Womens) అఘాయిత్యాలే జరుగుతున్నాయి. కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన

బురఖా వేసుకున్నా భద్రత లేదు.. కిస్ ఇచ్చి యువకుడు రచ్చ !
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఏ మూలన చూసినా మహిళలపై ( Womens) అఘాయిత్యాలే జరుగుతున్నాయి. కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న... మహిళలను టార్గెట్ చేసి కొంతమంది దుర్మార్గులు... కామ వాంఛతో రెచ్చిపోతున్నారు. మహిళలపై మృగాళ్ల వ్యవహరిస్తున్నారు. సందు దొరికితే చాలు... మహిళలను వేధించి.. నరకం చూపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా.. ఆడదైతే చాలు అన్నట్లుగా కొన్ని మృగాలు వ్యవహరిస్తున్నాయి.

అయితే తాజాగా ఓ దుర్మార్గుడు చేసిన పని చూస్తే.. కామాంధులను నరికేసేంత.. కోపం రావాల్సిందే. ఓ మహిళ బురఖా ( Burkha ) వేసుకొని... వెళ్తుంటే ఆమెకు ముద్దు పెట్టి రచ్చ చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ సంఘటన హైదరాబాదులోని ( Hyderabad) పాతబస్తీలో జరిగినట్లు తెలుస్తోంది. తన పని పైన.. తాను బురఖా వేసుకొని... నేరుగా వెళ్తోంది. అయితే ఆమెకు ఎదురుగా ఓ బైక్ పైన యువకుడు వచ్చాడు.

గల్లీలో ఎవరూ లేరని గ్రహించి... వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి ముందు పెట్టాడు. బురఖా ఉన్న కూడా... ముద్దు పెట్టి ఆమెను వేధించాడు. ఆ మహిళ ఒక్కతే ఉండటంతో... భయాందోళనకు గురైంది. గట్టిగా అరిచింది. దీంతో అక్కడి నుంచి ఆ యువకుడు పరారయ్యాడు. అనంతరం అతన్ని బండ బూతులు తిట్టింది ఆ బాధిత మహిళ. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మహిళా బురఖా వేసుకున్న కూడా ఇలా చేయడం దారుణమని ఫైర్ అవుతున్నారు.

Next Story