- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడు మామూలోడు కాదు..పెళ్లి కూతురు చెల్లికి ముద్దులు !
సోషల్ మీడియా పెరిగిన కొద్దీ రకరకాల వీడియోలు బయటకు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వింత వింత సంఘటనలు...

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా పెరిగిన కొద్దీ రకరకాల వీడియోలు బయటకు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వింత వింత సంఘటనలు... క్షణాల్లోనే తెలిసిపోతున్నాయి. అయితే తాజాగా... ఓ పెళ్లి కొడుకు ( Breedgroom ) చేసిన పని.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా... పెళ్లికూతురు ( BRIDE) చెల్లెలికి ముద్దు పెట్టాడు వరుడు. అది కూడా రిసెప్షన్ ( Reception) వేదికపైనే... ఎవరు చేయని సాహసం చేశాడు.
రిసెప్షన్ టైంలో... వచ్చిన గెస్ట్ లందరూ... వధూవరులకు... గిఫ్ట్ ఇవ్వడం అనంతరం ఫోటోలు దిగడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వధూవరులు... కాస్త రొమాంటిక్ గా ఫోజులిచ్చి ఫోటోలు కూడా దిగుతారు. ఈ నేపథ్యంలోనే.. పెళ్లికూతురు చెల్లెలు స్టేజ్ పైకి వచ్చింది. అనంతరం పెళ్లికూతురుకు ముద్దు పెట్టే ప్రయత్నం చేసింది.
అదే సమయంలో పెళ్లి కూతురుకు వరుడు కూడా కిస్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే వెంటనే అతని ముఖాన్ని చేతులతో ఆపి, వెనక్కి నెట్టింది పెళ్లికూతురు చెల్లెలు. ఇక చేసేదేమీ లేక.. పెళ్లికూతురు చెల్లెలికి ముద్దు పెట్టేసాడు. అయితే.. అతడు చేసిన పనికి అక్కడున్న వాళ్లంతా నవ్వుకున్నారు. పెళ్లికూతురు కూడా.. ఏం పర్లేదు తన చెల్లికే పెట్టాడు అన్న ఫీలింగ్ లో నవ్వేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ సంఘటన తమిళనాడులో జరిగినట్లు తెలుస్తోంది.






