- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది దాహం వేసిన కాకి కథ కాదు.. తెలివైన చిలక కథ.. వీడియో చూస్తే మురిసిపోతారు
వేసవి(Summer) వచ్చిదంటే చాలు నీటి కష్టాలు మొదలవుతాయి. ఈ సమస్య మనుషులకే కాదు.. పక్షులకు, జంతువులకు కూడా ఉంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: వేసవి(Summer) వచ్చిదంటే చాలు నీటి కష్టాలు మొదలవుతాయి. ఈ సమస్య మనుషులకే కాదు.. పక్షులకు, జంతువులకు కూడా ఉంటుంది. అయితే పక్షులకు దాహార్తిని తీర్చేందుకు అక్కడక్కడా కొందరు జంతు ప్రేమికులు నీటి కుండలు ఏర్పాటు చేస్తుంటారు. మరికొన్ని చోట్ల ఆ సౌకర్యం కూడా లేక పక్షులు అల్లాడిపోతున్నాయి. తాజాగా ఓ పక్షి(Bird) నీటికోసం అల్లాడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే గుండె తరుక్కుపోవడం ఖాయం. అప్పటివరకు నీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడిన ఆ పక్షికి కులాయి కనిపించింది. వెంటనే ఆ కులాయి వద్దకు వచ్చి చేరింది.
కులాయి తిప్పి ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయకుడా చాలా జాగ్రత్తగా దాహార్తిని తీర్చుకునే ప్రయత్నం చేసింది. దీనిని ఓ వ్యక్తి సోషల్ మీడియా(Social Media) వేదికగా పోస్టు చేశారు. అది కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు పక్షిని ప్రశంసిస్తున్నారు. ఆ పక్షికి ఉన్న సోయి మనుషులకు లేకపాయే.. కొన్ని చోట్ల నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే సోయి కూడా లేకుండా.. ఇష్టమొచ్చినట్లు వేస్ట్ చేస్తుంటారంటూ మండిపడుతున్నారు. ఈ వేసవిలో జంతువులు, పక్షులకు నీరు పెడితే వాటి ప్రాణాలు కాపాడినవారం అవుతాము. అందువలన ఇంట్లోనే కాదు.. మన పరిసర ప్రాంతాల్లో పక్షులకు నీరు పెట్టి వాటి ప్రాణాలు కాపాడుదామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.






