- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్థరాత్రి మహిళ ఒంటరి ప్రయాణం... ఆటోడ్రైవర్ ఏం చేసాడంటే..?
సాధారణంగా మహిళలు అర్థరాత్రుల్లో ప్రయాణించేందుకు భయపడతారు.

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా మహిళలు అర్థరాత్రుల్లో ప్రయాణించేందుకు భయపడతారు. అందులోనూ ఒంటరిగా ప్రయాణించేందుకు వందసార్లు ఆలోచిస్తారు. అయితే బెంగళూరులో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ మహిళకు ఆటోలో ఎదురైనా అనుభవం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ ఆటో డ్రైవర్ చేసిన మంచి పనికి నెటిజన్స్ సెల్యూట్ చేస్తున్నారు. అర్ధరాత్రి రాపిడో ఆటోలో ప్రయాణించిన ఓ మహిళ.. డ్రైవర్ ప్రవర్తన వల్ల తాను పూర్తిగా భద్రంగా ఉన్నానని చెబుతూ.. ఆటోలో అతికించిన చేతిరాతతో ఉన్న ఓ నోటీసులో "నేను కూడా ఓ తండ్రిని, ఓ అన్నను.
మీ భద్రతే నాకు ముఖ్యం. సౌకర్యంగా కూర్చోండి" అని ఉండటాన్ని చూసి ముందు ఆశ్చర్యపోయినా, తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని తెలిపింది. అది చిన్న సందేశమే అయినా.. నా గమ్యస్థానాన్ని చేరుకునే వరకు ఎలాంటి భయానికి గాని, ఆందోళనకు గాని గురి కాలేదని పేర్కొంది. ఆ నోటీసుకు సంబంధించిన నోటీసును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ అవుతోంది. డ్రైవర్ ఆలోచనను నెటిజన్లు మెచ్చుకుంటూ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.






