- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్యులు షాక్.. మహిళ మెదడులో ఆస్కారిస్ పురుగు
ఓ మహిళ మెదడులో 8 సెంటీమీటర్ల పురుగు సజీవంగా ఉండటం వైద్యులను షాక్ కు గురి చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఓ మహిళ మెదడులో 8 సెంటీమీటర్ల పురుగు సజీవంగా ఉండటం వైద్యులను షాక్ కు గురి చేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సంఘటన వైద్య ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక మహిళకు నెలలుగా కడుపునొప్పి, డయేరియా, రాత్రిళ్లు చెమటలు, దగ్గు, తర్వాత జ్ఞాపకశక్తి సమస్యలు రావడంతో డాక్టర్లు MRI చేయగా.. మెదడులో ఒక వింత ముద్ద మాంసపు కనిపించింది. శస్త్రచికిత్సలో ఆ ముద్దను తీసేందుకు ప్రయత్నిస్తుండగా, లోపల అకస్మాత్తుగా కదులుతున్న 8 సెం.మీ. పొడవున్న సజీవ పురుగు బయటపడింది.
ఇది సాధారణంగా కార్పెట్ పైథాన్ అనే పాములలో మాత్రమే కనిపించే ఒఫీడాస్కరీస్ రొబర్టీస్ రౌండ్‌వార్మ్ అని తేలింది. మానవులలో.. అదీ మెదడులో ఇలాంటి పురుగు కనపడటం ప్రపంచంలో ఇదే మొదటి కేసు. అడవి ప్రాంతంలో సేకరించిన మొక్కలపై ఉన్న ఈ రౌండ్ వార్మ్ సూక్ష్మ గుడ్లను తెలియక తినడంతో అది ఆమె శరీరంలోకి చేరి, ప్రేగుల నుంచి రక్తనాళాల ద్వారా మెదడికి వెళ్లినట్టు వైద్యులు భావిస్తున్నారు. మెదడులో ఈ పురుగుకు కలిగిన ఇన్‌ఫ్లమేషన్ కారణంగా తలనొప్పి, గందరగోళం, జ్ఞాపక సమస్యలు వంటి లక్షణాలు వచ్చాయి.






