నదిలో రీల్స్.. కొట్టుకుపోయిన ఇన్‌ఫ్లుయెన్సర్ (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-16 10:12:37  IST  )

భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా గ్రామాలే వరదల ధాటికి రూపురేఖలు లేకుండా పోతున్నా.. ఇన్‌ఫ్లుయెన్సర్లు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. వరదల్లోనే రీల్స్ రికార్డ్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

నదిలో రీల్స్.. కొట్టుకుపోయిన ఇన్‌ఫ్లుయెన్సర్ (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా గ్రామాలే వరదల ధాటికి రూపురేఖలు లేకుండా పోతున్నా.. ఇన్‌ఫ్లుయెన్సర్లు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. వరదల్లోనే రీల్స్ రికార్డ్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటిదే హరిద్వార్ జిల్లాలో చోటు చేసుకుంది. నామన్ అనే ఇన్‌ఫ్లుయెన్సర్ రావసన్ నదిలో రీల్స్ చిత్రీకరించాడు. ఈ సమయంలో బలమైన ప్రవాహం ముంచెత్తడంతో కొట్టుకుపోయాడు. దీనికి కొన్ని నిమిషాల ముందు కూడా కొన్ని రీల్స్ చేశాడు నామన్. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. తిట్టిపోస్తున్నారు జనాలు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని అధికారులు, ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు.

ఇంతకు ముందు హరిద్వార్ గంగా నదిలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. సహరాన్‌పూర్‌కు చెందిన వ్యక్తి రీల్స్ చేస్తుండగా.. గంగా నదిలో మునిగిపోయిన విషయం తెలిసిందే. వార్నింగ్ బోర్డులు కూడా లెక్క చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

VIDEO

Next Story