రాజన్న సిరిసిల్ల జిల్లాలో అద్భుతం.. శివ లింగం ఆకారంలో చీమల పుట్ట

by Kema Shiva Kumar |

వర్షాకాలంలో వ్యవసాయ క్షేత్రాలతో పాటు ఇళ్లలోనూ చీమలు పుట్టలు పెట్టడం సర్వసాధారణం.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అద్భుతం.. శివ లింగం ఆకారంలో చీమల పుట్ట
X

దిశ, వెబ్‌డెస్క్: వర్షాకాలంలో వ్యవసాయ క్షేత్రాలతో పాటు ఇళ్లలోనూ చీమలు పుట్టలు పెట్టడం సర్వసాధారణం. కానీ, అవి పెట్టే పుట్టలు రకరకాల అకృతుల్లో ఓ రూపం లేకుండా ఉంటాయి. కానీ, రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్ద బోనాల గ్రామంలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఏకంగా సృష్టి, స్థితిలయకారుడు ఆ పరమ శివుడి ప్రతిరూపం అయిన లింగం ఆకారంలో చీమలు పుట్ట పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ పుట్టను చూసిన శివ భక్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు అది ముమ్మాటికీ సాక్షాత్తు పరమేశ్వరుడి రూపమేనని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం శివ లింగం ఆకారంలో ఉన్న పుట్టుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Next Story