- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అద్భుత సాహసం.. మంచులో మునిగాడు.. గిన్నిస్ రికార్డుతో బయటకొచ్చాడు!
వర్షం పడినా, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయినా మనం గజగజ వణికిపోతాం. వెంటనే స్వెట్టర్లు, బ్లాంకెట్లు వేసుకుంటాం.

దిశ, వెబ్ డెస్క్: వర్షం పడినా, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయినా మనం గజగజ వణికిపోతాం. వెంటనే స్వెట్టర్లు, బ్లాంకెట్లు వేసుకుంటాం. అంతెందుకు.. ఫ్రిడ్జ్‌లోని చిన్న ఐస్ ముక్కను కూడా మనం ఎక్కువసేపు చేతుల్లో పట్టుకోలేం. అలాంటిది ఓ వ్యక్తి శరీరంపై దుస్తువులు లేకుండా మంచులో రెండు గంటలకు పైగా పడుకున్నాడు. ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కదా! కానీ, నిజం.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం ఆ వ్యక్తి ఈ ఫిట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్‌గా మారింది. మరీ ఎవరు ఆ వ్యక్తి? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
స్విట్జర్లాండ్‌కు (Switzerland) చెందిన పవర్‌లిఫ్టర్ ఎలియాస్ మేయర్ ప్రపంచ రికార్డు సాధించేందుకు అసాధారణమైన సాహసం చేశాడు. 2024 ఏప్రిల్ 2న ఆయన ఆండెర్మాట్ మంచుగుట్టల్లో కేవలం స్విమ్ ట్రంక్స్ మాత్రమే ధరించి, తల బయటకి పెట్టి శరీరం మొత్తాన్ని మంచుతో కప్పేసుకున్నాడు. దాదాపు 2 గంటల 7 సెకన్ల పాటు మంచులోనే ఉండి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. అత్యధిక సమయం పూర్తి శరీరం మంచులో గడిపిన వ్యక్తిగా (Longest time spent in direct full body contact with snow) గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్‌గా మారింది.
అయితే, గతంలో ఈ రికార్డు పోలాండ్‌కు చెందిన వాలెర్జాన్ రొమానోవ్స్కీ పేరిట ఉండేది. 2022లో 1 గంట 45 నిమిషాలు 2 సెకన్లు ఈ విధంగా మంచులో ఉండి రికార్డు సాధించగా, తాజాగా ఎలియాస్ ఆ రికార్డు బ్రేక్ చేశాడు. ఇక ఈ సాహస ప్రయోగాన్ని రోడ్డుపక్కనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అధికారులు స్వయంగా నిర్వహించారు. శరీరం పైభాగం పూర్తిగా మంచుతో కప్పివేశారు. ఆయన తల కింద టవల్ వేసుకొని, శరీరమంతా మంచులో మునిగిపోయిన తీరు, చూడటానికి కూడా వణుకు పుట్టించేదిగా ఉంది. అంతేకాదు, ఈ సాహస ప్రయోగంలో వైద్య బృందం, ఎమర్జెన్సీ సిబ్బంది అతడి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించారు. హైపోథర్మియా, ఇతర ఆరోగ్యపరమైన ప్రమాదాల నుంచి అతడిని కాపాడే చర్యలు తీసుకున్నారు.






