- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళను గుడిలో బంధించి.. తాళం వేసి.. పోలీసులు వచ్చినా భయపడనంటూ రచ్చ(వీడియో)
ఓ మహిళ దేవుడిని దర్శించుకుని పూజ చేసేందుకు వెళ్లింది. కానీ హఠాత్తుగా అక్కడకు వచ్చిన పక్కింటి వృద్ధురాలు ఆమెను లోపలే బంధించి.. తాళం వేసింది. దాదాపు గంటపాటు మహిళ అక్కడే బంధీగా ఉండిపోగా.. అక్కడకు చేరుకున్న భర్త తాళం

X
దిశ, వెబ్ డెస్క్ : ఓ మహిళ దేవుడిని దర్శించుకుని పూజ చేసేందుకు వెళ్లింది. కానీ హఠాత్తుగా అక్కడకు వచ్చిన పక్కింటి వృద్ధురాలు ఆమెను లోపలే బంధించి.. తాళం వేసింది. దాదాపు గంటపాటు మహిళ అక్కడే బంధీగా ఉండిపోగా.. అక్కడకు చేరుకున్న భర్త తాళం పగులగొట్టి భార్యను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ వృద్ధురాలు అతన్ని అడ్డుకుంది. తాళం తీయనంటే తీయనని.. తీయనివ్వనని వారించింది. పోలీసులు వచ్చినా భయపడనంటూ అరుస్తూ రచ్చ చేసింది. కానీ అతను తాళం పగులగొట్టి బయటకు తీశాడు. బాధితురాలు ఈ విషయంపై జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మనుషులు మరీ ఇంత వింతగా ఉన్నారేంటని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Next Story






