వారెవ్వా డ్రంక్ అండ్ డ్రైవ్ చరిత్రలో రికార్డు..! మీటర్ బద్దలయ్యే రీడింగ్ నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-31 16:49:54  IST  )

న్యూ ఇయర్ వేడుకలను యువత ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరుపుకుంటోంది.

వారెవ్వా డ్రంక్ అండ్ డ్రైవ్ చరిత్రలో రికార్డు..! మీటర్ బద్దలయ్యే రీడింగ్ నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూ ఇయర్ వేడుకలను యువత ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరుపుకుంటోంది. కొందరు బిర్యానీలతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే.. మరికొందరు లిక్కర్‌తో కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెబుతూ చిందులేస్తున్నారు. ఈ క్రమంలోనే మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని అరికట్టేందుకు తెలంగాణ పోలీసు శాఖ (Telangana Police Department) కట్టుదిట్టంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు (Drunk and Drive Test)లను కండక్ట్ చేస్తోంది.

తాజాగా హన్మకొండ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. మద్యం తాగి బండి నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తికి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయగా.. మీటరు బద్దలయ్యేలా ఏకంగా 432 రీడింగ్ నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2025 సంవత్సరంలో ఇదే అత్యధిక రికార్డు అని పోలీసు అధికారులు పేర్కొన్నారు. భారతదేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టాల ప్రకారం.. రక్తంలో 100 మి.లీ.కి 30 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటే నేరంగా పరిగణిస్తారు. కానీ, ఏకంగా బ్రీత్ అనలైజర్ మిషిన్‌లో 432 రీడింగ్ చూపించడంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఈ మేరకు సదరు వ్యక్తి వాహనాన్ని స్వాధీనం చేసుకుని అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Next Story