ఆకాశంలో అరుదైన దృశ్యం.. మరో లోకానికి డోర్ ఓపెన్ అయిందా (వీడియో)

by Disha Web Desk 6 |
ఆకాశంలో అరుదైన దృశ్యం.. మరో లోకానికి డోర్ ఓపెన్ అయిందా (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: టెక్నాలజీ అభివృద్ది చెందినప్పటి నుంచి ప్రపంచంలో ఏం జరిగినా కానీ, క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. ఎక్కడ ఏం జరిగినా సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారుతున్నాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆకాశంలో మెరుపులు పలు ఆకారాల్లో దర్శనమిస్తుంటాయి. తాజాగా, బెంగళూరులో నిన్న సాయంత్రం అరుదైన దృశ్యం కనిపించింది. ఆకాశంలో మరోలోకానికి డోర్ ఓపెన్ చేసినట్టుగా నీడ కనిపించింది. అది గమనించి కొంత మంది దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Next Story