వ్యూస్ కోసం రోడ్లపై రచ్చ.. రెండు వాహనాల మధ్య ఇరుక్కుని

by velandi.Saikiran |

రోజులు మారినాకొద్దీ... జనాలు కూడా మారిపోతున్నారు. ముఖ్యంగా ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో... జనాలు

వ్యూస్ కోసం రోడ్లపై రచ్చ.. రెండు వాహనాల మధ్య ఇరుక్కుని
X

దిశ, వెబ్ డెస్క్: రోజులు మారినాకొద్దీ... జనాలు కూడా మారిపోతున్నారు. ముఖ్యంగా ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో... జనాలు కూడా దానికి అడిక్ట్ అయిపోతున్నారు. పొద్దున లేస్తే చాలు మొబైల్ ఫోన్లు తీయడం... రాత్రి పడుకునే వరకు అందులోనే ఉండడం చూస్తున్నాం. వినియోగదారులు పెరిగిన తరుణంలోనే సోషల్ మీడియా స్టార్లు కూడా విపరీతంగా పెరిగారు. వింత వింత స్టంట్స్ చేసి, వైరల్ అవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే... హిమాచల్ ప్రదేశ్ యూట్యూబర్... రోడ్లపై విన్యాసాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. రోడ్లపై స్టంట్స్ చేసి... వ్యూస్ రాబట్టే హిమాచల్ ప్రదేశ్ యూట్యూబర్ సమీర్ ఖాన్... తాజాగా మరో స్టంట్ చేశాడు. రోడ్డుపై స్పీడ్ గా బైక్ డ్రైవ్ చేస్తూ.... ఓ బస్సు, ట్రక్కు మధ్య ఇరుక్కున్నాడు.

అయితే ట్రక్కు డ్రైవర్ కాస్త చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ యూట్యూబర్ బతికి బయటపడ్డాడు. లేకపోతే పైకి పోయేవాడు. వీడియోలో ఈ విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇక ఈ ఇన్సిడెంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలా రోడ్లపై స్టంట్స్ చేసే యూట్యూబర్ పై చర్యలు తీసుకోవాలని హిమాచల్ పోలీసులను కోరుతున్నారు నెటిజెన్స్.

Next Story