- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UP: భర్తకు మూడో పెళ్లి..మండపంలోనే చితకబాదిన రెండో భార్య, వీడియో వైరల్
యూపీకి చెందిన ఓ వ్యక్తి కూడా ఇద్దరు భార్యలను కాదని మూడో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. దాదాపు 50 ఏళ్ల వయసుకు వచ్చిన తర్వాత పెళ్లి గ్రాండ్ గా చేసుకునేందుకు రెడీ అయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి.. ఏడు అడుగుల బంధం, నూరేళ్ల జీవితం. ఒక్కసారి పెళ్లి చేసుకున్నారంటే, అర్ధాంగితో చివరి వరకు కొనసాగాలని హిందూ ధర్మాలు చెబుతున్నాయి. కానీ కొంత మంది పెళ్లిళ్లు చేసుకొని కొన్ని రోజులు ఎంజాయ్ చేశాక, విడాకులు కూడా తీసుకుంటున్నారు. మరి కొంతమంది అయితే విడాకులు తీసుకోక ముందే వేరే వాళ్లతో రిలేషన్లు పెట్టుకుంటున్నారు. ఇందులో మగ వాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా ఉన్నారు. ఇక ఒక్కొక్కరైతే మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఈ లిస్ట్ లో క్రికెటర్లు, రాజకీయ నాయకులు, సినీ నటులు కూడా ఉన్నారు.
నిత్యపెళ్లి కొడుకును చితకబాదిన రెండో భార్య
ఓ నిత్యపెళ్లి కొడుకును చితకబాదింది అతని రెండో భార్య. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యూపీకి ( UP) చెందిన ఓ వ్యక్తి కూడా ఇద్దరు భార్యలను కాదని మూడో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. దాదాపు 50 ఏళ్ల వయసుకు వచ్చిన తర్వాత పెళ్లి గ్రాండ్ గా చేసుకునేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ విషయం తెలిసిన రెండో భార్య, పెళ్లి మండపానికి వచ్చి రచ్చ రచ్చ చేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ లోని సీతాపూర్ కు చెందిన ఓ వ్యక్తి మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి, రెండో పెళ్లి చేసుకున్న అతడు.. ఆమెను కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే కోర్టులో రెండో భార్యకు చెందిన వరకట్నం వేధింపుల కేసు నడుస్తోంది.
ఈ నేపథ్యంలోనే మూడో పెళ్లికి కూడా సదరు వ్యక్తి సిద్ధమయ్యాడు. పెళ్లి కోసం గ్రాండ్ గా ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. అయితే పెళ్లి పీటల పైన ( Marriage) ఆ వ్యక్తి కూర్చోగానే రెండో భార్య ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఆ వ్యక్తిని దారుణంగా కొట్టింది. అతడి గల్లా పట్టి లాగింది. బంధువుల సమక్షంలోనే ఆ నిత్య పెళ్ళికొడుకు అంతు చూసింది. ఈ దెబ్బకు పెళ్లి కూడా ఆగిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన సామాజిక వేత్తలు చాలా సీరియస్ అవుతున్నారు. అటు నెటిజెన్స్ కూడా రక రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ముసలితనానికి వచ్చిన మీకు మూడో పెళ్లి ఎందుకురా ? అంటూ కొంత మంది దారుణంగా పచ్చి బూతులతో రెచ్చిపోతున్నారు. ఒక్క భార్య తోనే వేగలేక పోతున్నామంటే, మూడు పెళ్లిళ్లు చేసుకుని ఏం సాధిస్తావు ? అని మరి కొంత మందిని నిలదీస్తున్నారు. కొంచెం అయినా సిగ్గుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఆ 50 ఏళ్ల వ్యక్తితో పెళ్లికి సిద్ధం అయిన లేడీ వయస్సు చాలా తక్కువేనట. దాదాపు ఇద్దరికీ 20 ఏళ్ల వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు.






