కార్లపై బీరు సీసాలతో దాడి.. యువతి అరాచకం!

by velandi.Saikiran |   (  Updated:2025-06-18 15:33:33  IST  )

సోషల్ మీడియాలో.. అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ లేడీ చేసిన పని సోషల్

కార్లపై బీరు సీసాలతో దాడి.. యువతి అరాచకం!
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో.. అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ లేడీ చేసిన పని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ లేడీ.. రోడ్డుపైన వెళ్తున్న కార్లపై దాడి చేస్తూ రచ్చ చేసింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని ( Benguluru).. ఓ ఏరియాలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న ఓ మహిళ ( Women).. రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తోంది. అయితే ఆమె చేతిలో బీరు (Beer) సీసాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఖరీదైన కారు.. ఆమె పక్క నుంచి దూసుకెళ్లింది. దీంతో... ఆ బీరు సీసాతో.... కారును గట్టిగా కొట్టింది. అయితే ఆ మహిళ గట్టిగా కొట్టడంతో... కారు ఓనరు ఆపకుండా వెళ్ళిపోయాడు. దీంతో ఆ లేడి మరింత రెచ్చిపోయింది.

మరో మూడు కార్లపై కూడా అలాగే దాడి చేసింది. చేసేదేమీ లేక ఆ కారు ఓనర్లు కూడా... ఆమెను ఏమనకుండా వెళ్లిపోయారు. ఆమె మతిస్థిమితం బాగా లేదని అర్థం చేసుకున్న కారు ఓనర్లు.... వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన నెట్టిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆమె మతిస్థిమితం బాగా లేక అలా సీసాలతో కొడుతోందని.. అంటున్నారు.

Instagramme Link

Next Story