స్కూల్ కు వెళ్ల‌న‌ని అల్ల‌రి..ఏకంగా మంచంతోనే లేపేశారు!

by velandi.Saikiran |

మధ్యప్రదేశ్ లో ఓ కుర్రాడు పాఠశాలకు వెళ్ళమంటే, వెళ్లబోనని తల్లిదండ్రులకు నరకం చూపించాడు. మంచం పట్టుకొని, బాగా ఏడ్చాడు.

స్కూల్ కు వెళ్ల‌న‌ని అల్ల‌రి..ఏకంగా మంచంతోనే లేపేశారు!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: చిన్నపిల్లలు చేసే అల్లరి అందరికీ నచ్చుతుంది. కాస్త చిరాకు వస్తుంది కానీ.. పిల్లలు అల్లరి చేస్తేనే అందం. అల్లరి చేస్తేనే ఆరోగ్యంగా ఉన్నట్లు అని వైద్యులే చెబుతారు. అదే చిన్నారులు స్కూల్ వెళ్లే సమయంలో యాక్టింగ్ మొదలు పెడతారు. ఏదో ఒక‌టి చెప్పి, త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. స్కూల్ కు అస్సలు వెళ్ళనని, తెగ ఏడ్చేస్తారు. కొంతమంది పిల్లలు అయితే, స్కూల్ కు చాలా ఇష్టంగా వెళ్తారు. కానీ కొంతమంది పిల్లలు కింద వీడియోలో చూపించినట్లుగా.. చుక్కలు చూపిస్తారు.

తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ కుర్రాడు పాఠశాలకు వెళ్ళమంటే, వెళ్లబోనని తల్లిదండ్రులకు నరకం చూపించాడు. మంచం పట్టుకొని, బాగా ఏడ్చాడు. మంచం వదలకుండా... గట్టిగా పట్టేసుకున్నాడు. ఇక చేసేది ఏమీలేక అక్కడే ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు.. మంచంతో పాటే అతన్ని స్కూల్ కు తీసుకువచ్చారు. స్కూల్ దగ్గరికు వచ్చాక మంచం తొలగించి అతన్ని.. ఉపాధ్యాయులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. పిల్ల‌ల‌ను స్కూల్ కు తీసుకువెళ్లే కొత్త టెక్నిక్ అదుర్స్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్లిక్

Next Story