స్మార్ట్‌ఫోన్‌ కాలంలో కలం పట్టిన బాల రచయిత్రి.. 13 ఏళ్లకే సూపర్ ఫాంటసీ నవల రాసి రికార్డు!

by Yella Dhawani Reddy |

నేటి తరం పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ లేని జీవితం అసంభవం అన్నట్లుగా మారిపోయారు. వీడియోలు చూస్తూ, మొబైల్‌ గేమ్స్ ఆడుతూ, గంటల తరబడి డిజిటల్‌ తెరలకే పరిమితమవుతున్నారు.

స్మార్ట్‌ఫోన్‌ కాలంలో కలం పట్టిన బాల రచయిత్రి.. 13 ఏళ్లకే సూపర్ ఫాంటసీ నవల రాసి రికార్డు!
X

దిశ; వెబ్ డెస్క్: నేటి తరం పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ లేని జీవితం అసంభవం అన్నట్లుగా మారిపోయారు. వీడియోలు చూస్తూ, మొబైల్‌ గేమ్స్ ఆడుతూ, గంటల తరబడి స్క్రీన్ ముందే కూర్చోవటం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. పుస్తకాలు అంటే అఇష్టంగా, చదవడం అంటే భారంగా భావిస్తూ డిజిటల్ తెరల్లోనే మునిగిపోతోన్నారు. కానీ, ఓ చిన్నారి మాత్రం ఈ ట్రెండ్‌కు పూర్తిగా భిన్నంగా ముందుకెళ్లింది. సెల్‌ఫోన్లలో గేమ్స్ ఆడుకోవడం బదులుగా, అక్షరాలను కథలుగా అల్లడం నేర్చుకుంది. సాహిత్యాన్నే స్నేహితుడిగా చేసుకుని 13 ఏళ్ల వయసులోనే 500 పేజీల ఫాంటసీ నవల రాసి, పాఠక లోకాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఎవరా చిన్నారి? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన మహిరమ వయస్సు కేవలం 13 సంవత్సరాలు. చిన్నతనం నుంచే సాహిత్యం పట్ల ఆసక్తి మొదలైంది. ఆ ఇష్టంతోనే 9 ఏళ్ల వయసులోనే చిన్న చిన్న పద్యాలు, పాటలు రాయడం ప్రారంభించింది. 10 ఏళ్ల వయసులో తన స్నేహితులతో కలిసి ఓ కథను రాసింది. ఆ తర్వాత ఆ కథను నవలగా అభివృద్ధి చేయాలనే సంకల్పించుకుంది. తన ఊహాశక్తిని, రచనా నైపుణ్యాన్ని కలగలిపి రెండు సంవత్సరాల పాటు శ్రమించి, 'రూబీ బ్లూ స్ట్రీమ్‌ అండ్‌ ద బాండ్‌ ఆఫ్‌ ఫైర్‌ (Ruby Bluestream and the Bond of Fire)' పేరుతో 500 పేజీల పూర్తి స్థాయి ఫాంటసీ నవల రాసింది. ప్రకృతిలోని భూమి, నీరు, గాలి, అగ్ని.. మానవ జీవితంతో ఎలా ముడిపడి ఉంటాయనే తెలిజేస్తూ రాసిన ఈ నవల చిన్నపిల్లలను మాత్రమే కాదు పెద్దవాళ్లను సైతం ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో 9వ తరగతి చదువుతోన్న మహిరమ కేవలం రచయిత్రిగానే కాకుండా, కళల పట్లా ఎంతో అభిరుచి కలిగి ఉంది. కర్ణాటక సంగీతంలో ఫోర్త్ గ్రేడ్ శిక్షణ తీసుకుంటోంది. అదే విధంగా హస్తకళలు, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్ వంటి అనేక రంగాల్లోనూ ప్రావీణ్యం కలిగి ఉంది. ఫ్రెంచ్ భాష నేర్చుకుంటూ, తనలోని ఆసక్తులను విస్తరిస్తోంది. ఇక ఈ యువ రచయిత్రి చూపించిన పట్టుదల, శ్రమ, కలలపై నమ్మకం.. నేటి యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.

Next Story