- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్రోల్ పోయించుకున్నాడు..బంక్ చుట్టూ మూడు రౌండ్లు కొట్టి మరీ జంప్ !
పెట్రోల్ కొట్టించిన తర్వాత, డబ్బులు ఇవ్వకుండానే ఓ కారు డ్రైవర్ జంప్ అయ్యాడు. వెళ్లే ముందు బంక్ చుట్టూ రౌండ్లు కూడా కొట్టాడు.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే, మరికొన్ని చాలా భయంకరంగా ఉంటాయి. ఇక మరికొన్ని వీడియోలు అయితే చాలా వింతగా, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ గా ఒక కారు వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత, డబ్బులు ఇవ్వకుండా కార్లో ఓ డ్రైవర్ పారిపోయాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ( Firozabad) అర్ధరాత్రి చోటు చేసుకుంది.
డబ్బులు ఇవ్వకుండానే పారిపోయిన కారు డ్రైవర్
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 7వ తేదీన రాత్రి సమయం చూసుకొని ఓ కారు డ్రైవర్ స్కెచ్ వేశాడు. తన దగ్గర డబ్బులు లేకున్నా, కారులో ఫుల్ ట్యాంక్ కొట్టించాడు. ఆ తర్వాత నిద్ర మత్తులో ఉన్న బంక్ వర్కర్లు డబ్బులు అడిగారు. దీంతో చాలా తెలివిగా ప్రవర్తించిన కారు డ్రైవర్, బంకులో మూడు రౌండ్లు కొట్టాడు. ఆ తర్వాత రోడ్డెక్కి జంప్ అయ్యాడు.
ఇక కారు వేగంగా దూసుకు వెళ్లిన నేపథ్యంలో బంకు వర్కర్లు ఏమీ చేయలేక, నోరెళ్లబెట్టారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్, రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పెట్రోల్ ఇలా కూడా పోయించుకుంటారా? డబ్బులు లేనప్పుడు ఈ ఐడియా ఫాలో అయితే సరిపోతుందని దారుణంగా ఆడుకుంటున్నారు. అయితే డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన కారు డ్రైవర్ పై కేసు పెట్టాలని మరికొంతమంది డిమాండ్ చేస్తున్నారు.






