- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జూలో ఒక్కసారిగా పులుల ముందు దూకిన బాలుడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్?

దిశ, వెబ్ డెస్క్: చిరుత పులి (Tiger) పేరు చెబితేనే పిల్లల నుంచి పెద్దల వరకు భయపడిపోతుంటారు. పొరపాటున కూడా వాటి దగ్గరగా వెళ్లేందుకు సాహిసించరు. అలాంటిది ఓ బాలుడు ఏకంగా జూలో ఒకేచోట నాలుగైదు పులులు ఉన్న ప్రదేశంలో ఒక్కసారిగా దూకేశాడు. ఆ తర్వాత కచ్చితంగా ఆ బాలుడిని పులులు తినేసి ఉంటాయని అనుకుంటున్నారు కదా.. కానీ, ఇక్కడ జరిగింది వేరే. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోండి.
తాజాగా ఏడేళ్ల బాలుడు తన తల్లితో కలిసి జూకి (Zoo) వెళ్లాడు. అక్కడ పెద్దపులుల సమూహాన్ని రీలింగ్పై కూర్చొని అందరితోపాటు చూస్తున్నాడు. అయితే ఏం అనుకున్నాడో ఏమో ఉన్నట్టుండి ఒక్కసారిగా పులుల ఉన్న ప్రదేశంలో దూకేశాడు. ఈ షాకింగ్ ఘటనకు తల్లితోపాటు అక్కడున్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాదాపు నాలుగైదు పులులు బాలుడి చుట్టూ చేరాయి. గంభీరంగా గాండ్రించటంతో బాలుడు ఏడువటం ప్రారంభించాడు. అనంతరం ఒక్కసారిగా అక్కడ సీన్ అంతా మారిపోయింది. ఆ పులులతో బాలుడు ఆడుకోవటం మొదలుపెట్టాయి. బయటకు వెళ్లేందుకు మెయిన్ గేటు వరకు బాలుడితో పాటు ఓ చిన్నపులి పిల్ల వచ్చి సాగనంపింది. చివరికి బయటకు వచ్చి తల్లితో కలిసి చిన్నపులికి బాయ్ చెప్పాగా.. అది కూడా తిరిగి బాయ్ చెప్పింది.
ఆశ్చర్యకరంగా ఉంది కదా.. మరీ ఇక్కడి ఓ ట్విస్ట్ ఉంది. ఈ వీడియో ఏఐ రూపొందించింది. ప్రస్తుతం పిల్లలకు వేసవి సెలవులు నడుస్తోన్నాయి. చాలా మంది తమ పిల్లలను తీసుకుని కొత్త ప్రదేశాలకు, టూర్లకు వెళ్తుంటారు. అలాంటి సమయలో ఏమాత్రం ఏమరు పాటున ఉన్నా కూడా.. లేని సమస్యలు కొని తెచ్చుకొవాల్సి ఉంటుందని అవగాహన కల్పించే ఉద్దేష్యంతో ఈ వీడియోను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక ఈ అవగాహన వీడియో నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.