74ఏళ్ల వ్యక్తి.. బతికుండగానే చితిపైకి.. అంత్యక్రియల్లో చుట్టాల ఏడుపు వర్ణనాతీతం

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-12 17:48:40  IST  )

ఒక వ్యక్తి మరణించిన తర్వాత అంత్యక్రియలు జరుగుతాయి. కానీ ఈయన మాత్రం బతికుండగానే తన అంతిమ సంస్కారాలను చూడాలనుకున్నాడు. ఇందుకోసం అందరినీ ఆహ్వానించాడు. దీంతో వందలాది మంది ఈ లాస్ట్ రైట్స్‌కు హాజరుకాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో

74ఏళ్ల వ్యక్తి.. బతికుండగానే చితిపైకి.. అంత్యక్రియల్లో చుట్టాల ఏడుపు వర్ణనాతీతం
X

దిశ, వెబ్ డెస్క్ : ఒక వ్యక్తి మరణించిన తర్వాత అంత్యక్రియలు జరుగుతాయి. కానీ ఈయన మాత్రం బతికుండగానే తన అంతిమ సంస్కారాలను చూడాలనుకున్నాడు. ఇందుకోసం అందరినీ ఆహ్వానించాడు. దీంతో వందలాది మంది ఈ లాస్ట్ రైట్స్‌కు హాజరుకాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాడు. బీహార్ గయా జిల్లాలోని కొంచి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

మాజీ వైమానిక దళ సైనికుడు అయిన 74ఏళ్ల మోహన్ లాల్ చనిపోయాక తనను జనాలు ఎలా గౌరవిస్తారు? ఎవరు తన అంత్యక్రియలకు హాజరవుతారు? ఎలా ఏడుస్తారు? చూడాలని అనుకున్నాడు. బతికుండగానే చివరి ప్రయాణానికి అందరినీ పిలిచాడు. చనిపోయిన వారికి కప్పినట్లుగానే అతన్ని తెల్లటి దుస్తులతో.. పూల దండలు వేసి.. పడుకోబెట్టి.. డ్యాన్సులు, నినాదాలతో ఆయనను ముక్తిధామ్‌కు చేర్చారు. చితిపై పడుకోబెట్టారు. కానీ ఆ తర్వాత అతని స్థానంలో దిష్టిబొమ్మను పెట్టి దహనం చేశారు. ఈ సమయంలో చుట్టాల ఏడుపు వర్ణనాతీతంగా కనిపించింది.ఇక చితిని కాల్చాక బూడిదను నదిలో విడిచారు. అంతిమ సంస్కారాల తర్వాత చేయాల్సిన నియమాలన్నీ పాటించారు. దీంతో తృప్తిపొందిన మోహన్ లాల్.. ఆ తర్వాత వచ్చిన జనాలందరకీ సామూహిక భోజనాలు పెట్టించాడు.

కాగా మోహన్ లాల్ ఇప్పటికే అనేక సామాజిక కార్యక్రమాలు చేశాడు. తన పెన్షన్‌ను ఇందుకోసం ఉపయోగిస్తుంటాడు. ఈ మధ్య వర్షాకాలంలో దహన సంస్కారాలకు గ్రామస్తులు ఇబ్బందిపడుతున్నారని.. ముక్తిధామ్‌ను నిర్మించాడు. ఇక ఆయనకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు కాగా అందరూ సెటిల్ అయిపోయారు. భార్య జీవన్ జ్యోతి 14ఏళ్ల క్రితమే కాలం చేసింది.

Next Story