ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం.. మళ్ళీ 1941 రోజులు రాబోతున్నాయా.. ఆకలి చావులు తప్పవా..!.. భయం పుట్టిస్తున్న వీడియో

by Sujitha Rachapalli |

2025 వరెస్ట్‌గా ఉండబోతోందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1941 క్యాలెండర్‌ను పోలి ఉండటం.. ఒకే తేదీ ప్యాటర్స్ కలిగి ఉండటం.. భారీ ప్రమాదాలు

ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం.. మళ్ళీ 1941 రోజులు రాబోతున్నాయా.. ఆకలి చావులు తప్పవా..!..  భయం పుట్టిస్తున్న వీడియో
X

దిశ, ఫీచర్స్ : 2025 వరెస్ట్‌గా ఉండబోతోందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1941 క్యాలెండర్‌ను పోలి ఉండటం.. ఒకే తేదీ ప్యాటర్స్ కలిగి ఉండటం.. భారీ ప్రమాదాలు జరగబోతున్నాయనేందుకు సంకేతమని భయం పుట్టిస్తోంది. 1941లో రెండో ప్రపంచ యుద్ధం, సామూహిక మరణాలు, బాంబ్ దాడులు, ఆకలి చావులు వంటి దుర్ఘటనలతో విషాదకరమైన సంవత్సరంగా పరిగణించబడగా.. 2025లోనూ అదే జరుగుతుందని ఈ వీడియో చెప్తోంది.

2025 మొదలైనప్పటి నుంచి ఇప్పటికే కాలిఫోర్నియా ఫారెస్ట్ ఫైర్స్, మహాకుంభ్ స్టాంపేడ్, బెల్జియం దాడి, ఆపరేషన్ సిందూర్, RCB స్టాంపేడ్, అహ్మదాబాద్ విమాన ప్రమాదం, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, రైలు ప్రమాదాలు వంటి సంఘటనలు జరిగాయని.. 2025 పూర్తి అయ్యే కల్లా మరిన్ని దారుణాలు చూస్తామని భయపెడుతున్నారు విశ్లేషకులు. ఇదొక టైమ్ లూప్‌ను సూచిస్తుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ పోలికను మూర్ఖత్వంగా పరిగణిస్తున్నారు. క్యాలెండర్స్ రిపీట్ అయితే మాత్రం ప్రమాదాలు కూడా రిపీట్ అవుతాయా.. ఇలాంటి వీడియోలతో అనవసరంగా జనాలను భయపెట్టొదని తిడుతున్నారు.

VIDEO

Next Story