టయోటా మెరుగైన సర్వీసుల కోసం ‘స్మైల్స్ ప్లస్’ ఆఫర్

144

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) తన వినియోగదారుల కోసం ప్రీ-పెయిడ్, కస్టమైజ్ సర్వీస్ ప్యాకేజీని శుక్రవారం విడుదల చేసింది. ‘స్మైల్స్ ప్లస్’ ఆఫర్ కింద అనుకూలమైన ప్రాంతంలో సర్వీసులు, టయోటా ఒరిజినల్ పరికరాల, సర్వీస్ ధరల విషయంలో పలు ప్రయోజనాలను అందించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. తమ కంపెనీ వినియోగదారులకు మెరుగైన మొబిలిటీ అవసరాలను తీర్చే ప్రయత్నాల్లో భాగంగానే టయోటా ‘స్మైల్స్ ప్లస్’ ఆఫర్‌ను ఇస్తున్నట్టు టీకేఎం సీనియర్ వైస్-ప్రెసిడెంట్ నవీన్ సోనీ చెప్పారు. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లకు కొత్త సేవలను అందించాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఈ సేవలను అందించడం ద్వారా వినియోగదారులతో తమకున్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని కంపెనీ భావిస్తోంది. ఇటీవల మారుతున్న వినియోగదారుల అవసరాలకు తగినట్టుగా, ఆటోమొబైల్ మార్కెట్లో డిమాండ్‌లకు అనుగుణంగా మరిన్ని సేవలను అందించనున్నట్టు నవీన్ సోనీ వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..