'బోల్డ్ పాప'కు బంపర్ ఆఫర్.. ఏకంగా పాన్ ఇండియా మూవీలోనే

by  |
బోల్డ్ పాపకు  బంపర్ ఆఫర్.. ఏకంగా పాన్ ఇండియా మూవీలోనే
X

దిశ, వెబ్ డెస్క్: ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో బోల్డ్ బ్యూటీ గా టాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది పాయల్ రాజ్ పుత్. తన అందంతో యూత్ కు పిచ్చెక్కిపోయేలా చేయటమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ బంపర్ ఆఫర్ ని పట్టేసింది. కన్నడలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ‘హెడ్‌ బుష్‌’లో పాయల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.

కన్నడ హీరో ధనుంజయ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఓ డాన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారట. 1960–1980 కాలంలో సాగే కథాంశం కావడంతో పాయల్ రెట్రో లుక్ లో కనిపించనుందని టాక్. ఇక ఈ మూవీని కన్నడతో పాటు.. తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీలోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎంట్రీలోనే పాన్ ఇండియా ఫిలింలో అవకాశాన్ని సొంతం చేసుకున్న పాయల్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. మరి టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే భారీ హిట్ ని అందుకున్న ఈ భామ శాండిల్ వుడ్ లో కూడా అంతే రచ్చ చేస్తుందేమో చూడాలి.



Next Story

Most Viewed