తనకన్న చిన్నవాడితో స్వీటీ పెళ్లి.. త్వరలోనే ముహూర్తం

by  |
తనకన్న చిన్నవాడితో స్వీటీ పెళ్లి.. త్వరలోనే ముహూర్తం
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున అనుష్క శెట్టి అని చెప్పేస్తారు. ప్రస్తుతం స్వీటీ పెళ్లి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అమ్మడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది? ఎవర్ని చేసుకుంటుంది అనే ప్రశ్నలు ఎప్పుడు ఆమె అభిమానులకు ఎదురవుతూనే ఉంటాయి. ఇకపోతే ఇండస్ట్రీలో ప్రభాస్- అనుష్క జోడి మీద వచ్చిన పుకార్లు అన్నీ ఇన్నీ కావు. తాము మంచి స్నేహితులం మాత్రమే అని ఆ జంట తెలుపడంతో వాటికి చెక్ పడ్డాయి. ఆ తర్వాత అనుష్క పెళ్లి ఇండస్ట్రీలోని ఒక డైరెక్టర్ కొడుకుతో అంటూ ఇంకో పుకారుకు తెరలేపారు. అది కూడా ఫేక్ అని తెలియడం తో స్వీటీ పెళ్లి విషయం మరుగున పడింది.

ఇక తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే అనుష్క పెళ్లి కూతురు కానున్నదంట. కరోనా సమయంలో ఇంట్లో ఉండడం వలన కుటుంబ సభ్యుల ఒత్తిడితో స్వీటీ పెళ్ళికి ఒప్పుకుందంట. ఇప్పటీకే ఆమె కుటుంబ సభ్యులు పెళ్ళికొడుకుని వెతికారని, అతడు దుబాయ్ కి చెందిన ఒక యువ వ్యాపారవేత్తని సమాచారం. అంతేకాదు ఆ వ్యాపారవేత్త అనుష్క కన్నా వయసులో చిన్నవాడని కూడా వినికిడి. ఒకవేళ అన్నీ కుదిరితే కరోనా పరిస్థితులు చక్కబడ్డాక వీరి వివాహం జరగనుందని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ వార్త కూడా నిజమా? లేదా అని తెలియాలంటే స్వీటీ నోరు విప్పాల్సిందే..

Next Story

Most Viewed