- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రానున్నది హిందుత్వ తుఫాన్.. NRC, NPR ఆపాలంటే ఇదొక్కటే మార్గం : అసద్
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన NRC, NPRను అడ్డుకోవాలంటే ఎంఐఎంకు ఓటు వేయాలని హైదరాబాద్ ఎంపీ కోరారు. రానున్న రోజుల్లో ఏపీలో హిందుత్వ తుఫాన్ రాబోతుందని.. మజ్లిస్ గెలిస్తే ఆర్ఎస్‌ఎస్ హిందుత్వ మతవాదులతో పోరాడగలుగుతుందన్నారు. హిందుత్వ వాదులను అడ్డుకోవాలంటే ముస్లింలు రాజకీయంగా బలపడాలన్నారు. ఇతర పార్టీలకు ఓటేస్తే వారు కూడా హిందుత్వ వాదానికే బలం చేకూరుస్తారని చెప్పారు. ఏపీలో బీజేపీని అడ్డుకోవాలంటే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన NRC, NPRను అడ్డుకోవాలంటే ఎంఐఎంకు ఓటు వేయాలని హైదరాబాద్ ఎంపీ కోరారు. రానున్న రోజుల్లో ఏపీలో హిందుత్వ తుఫాన్ రాబోతుందని.. మజ్లిస్ గెలిస్తే ఆర్ఎస్‌ఎస్ హిందుత్వ మతవాదులతో పోరాడగలుగుతుందన్నారు.
హిందుత్వ వాదులను అడ్డుకోవాలంటే ముస్లింలు రాజకీయంగా బలపడాలన్నారు. ఇతర పార్టీలకు ఓటేస్తే వారు కూడా హిందుత్వ వాదానికే బలం చేకూరుస్తారని చెప్పారు. ఏపీలో బీజేపీని అడ్డుకోవాలంటే ఎంఐఎంకు ఓటు వేసి గెలిపించాలని అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. కాగా, ఇటీవల ఏపీలో లోకల్ ఎన్నికలు ముగియగా, త్వరలోనే అక్కడ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
Next Story






