ఆ హ్యాష్‌ట్యాగ్‌పై టిక్‌టాక్ నిషేధం!

by  |
#MilkCrateChallenge
X

దిశ, ఫీచర్స్ : ‘ప్రమాదకర, భయంకరమైన చాలెంజెస్’‌ కు టిక్‌టాక్ పెట్టింది పేరు. ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రాణాలతో చెలగాటమాడే కొత్తరకమైన చాలెంజ్‌లు రోజుకోకటి పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే బ్లాక్ అవుట్, హీలియం హఫింగ్ చాలెంజ్‌లతో ఎంతోమంది యువత చనిపోగా.. తాజాగా ‘మిల్క్ క్రేట్ చాలెంజ్’ తెరమీదకొచ్చింది. అయితే వీటివల్ల చాలా ప్రమాదమని, వాటిని ఎంకరేజ్ చేయొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో టిక్‌టాక్ ప్రమాదకర స్టంట్‌ని ప్రొత్సహించే వీడియోలను తీసివేయాలని నిర్ణయించుకుంది.

immage

టిక్‌టాక్ వైరల్ ‘మిల్క్ క్రేట్ చాలెంజ్ ఆన్‌లైన్‌లో ట్రెండ్ సృష్టిస్తోంది. ఈ చాలెంజ్‌లో భాగంగా ఖాళీ మిల్క్ ట్రే డబ్బాలను పిరమిడ్‌ వలె నిర్మించాలి. వాటిని మెట్లుగా చేసుకుని, పైకి ఎక్కి, కిందకు దిగాలి. అస్థిరమైన ఆ డబ్బాల నిర్మాణం కూలిపోయి ఎంతోమంది గాయపడుతూ, ఎముకలు విరగొట్టుకుంటున్నారు. ప్రమాదకరమైన చాలెంజ్‌పై టిక్‌టాక్ స్పందించకపోవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. వైద్య నిపుణులు ఇలాంటివి తీవ్రమైన శస్త్రచికిత్సలు, ప్రాణాంతక గాయాలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. నిచ్చెన పైనుండి పడటం కంటే ఇది చాలా ఘోరంగా ఉంటుందని, కీళ్లకు మరింత ఎక్కువ ప్రమాదానికి గురి చేస్తున్నారని ఆర్థోపెడిక్ సర్జన్ షాన్ ఆంటోనీ అన్నారు.

tiktack

అయితే టిక్‌టాకర్లు చాలెంజ్ యాక్సెప్ట్ చేసి, వీడియోలను అప్‌లోడ్ చేస్తుండగా ఆయా వీడియోలు దాదాపు 82 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించినట్లు సమాచారం. కాగా సర్వత్రా విమర్శలు రావడంతో టిక్‌టాక్ ఆ కంటెంట్ నిషేధించింది. ఈ క్రమంలో టిక్‌టాక్ ప్లాట్‌ఫామ్ నుంచి #Milkcratechallengeని తొలగించారు. #Milkcrate, #cratechallenge వంటి సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లను కూడా బ్యాన్ చేసింది. ‘ప్రమాదకరమైన చర్యలను ప్రోత్సహించే లేదా కీర్తించే కంటెంట్‌ని టిక్‌టాక్ నిషేధిస్తుంది. అలాంటి వీడియోలను తీసివేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. సురక్షితమైన, సానుకూల వీడియోలను ప్రోత్సహించడం టిక్‌టాక్ ప్రధాన ప్రాధాన్యత’ అని వీడియో యాప్ ఒక ప్రకటనలో తెలిపింది.



Next Story

Most Viewed