పిడుగుపాటుకు ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

by  |

దిశ, మహబూబ్‌నగర్: పిడుగు పాటుకు గురై ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనలు నాగర్ కర్నూలు జిల్లాలో వేరువేరు ప్రాంతాల్లో ఆదివారం చోటుచేసుకున్నాయి. వివరాళ్లోకి వెళితే.. ఆదివారం సాయంత్రం నాగర్‌కర్నూలు జిల్లాలో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో పలు చోట్ల పిడుగులు సైతం పడ్డాయి. జిల్లాలోని కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామంలో వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా.. పిడుగు పడి రైతు అరేపల్లి కృష్ణయ్య మృతి చెందాడు. మరో మహిళా రైతు ప్రమాదం నుంచి తప్పించుకుంది. అదే విధంగా జిల్లాలోని వంగూర్ మండలం తిప్పరెడ్డిపల్లి గేట్ సమీపంలో పిడుగుపడి ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే బాధితులను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story