ముగ్గురు విలేక‌రుల అరెస్ట్

by  |
ముగ్గురు విలేక‌రుల అరెస్ట్
X

దిశ‌, ఖ‌మ్మం: డీసీసీబీ మాజీ చైర్మ‌న్ మువ్వా విజ‌య్‌ బాబును టార్గెట్ చేస్తూ వ‌రుసగా నిరాధార‌మైన క‌థ‌నాలు రాస్తున్న ఓ దినపత్రికకు చెందిన ముగ్గురు రిపోర్ట‌ర్ల‌ను స‌త్తుప‌ల్లి పోలీసులు అరెస్టు చేశారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. మువ్వా విజ‌య్‌బాబు డీసీసీబీ చైర్మ‌న్‌గా ఉన్న స‌మ‌యంలో సంస్థ కార్య‌క‌లాపాల్లో భారీ అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డ‌ారంటూ ఆరోపిస్తూ కొంత‌కాలంగా ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌రుస క‌థ‌నాలు ప్ర‌చురితం అవుతున్నాయి. అయితే దీనిని ఆయ‌న పలుమార్లు ఆక్షేపించారు. తాను ఎలాంటి అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేద‌ని, ఏదైనా ఉంటే ఆధార‌పూరితంగా వార్త‌లు రాయాల‌ని సూచించారు. దీంతో తమకు రూ.30 ల‌క్ష‌లిస్తేనే క‌థ‌నాలు ఆగుతాయ‌ని సదరు విలేకరులు బేర‌సారాల‌కు దిగిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో గురువారం నేరుగా స‌త్తుప‌ల్లిలోని విజయ్ నివాసానికి వెళ్లి డ‌బ్బులు తీసుకుంటుండ‌గా పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టించారు. అరెస్ట‌యిన వారిలో సదరు దినప‌త్రిక‌కు చెందిన ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ ఒకరు, జిల్లా ఇన్‌ఛార్జి, సత్తుపల్లి రిపోర్టర్ ఉన్నారు. త‌న‌పై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లతో వార్త‌లు రాస్తూ.. తీవ్ర మాన‌సిక క్షోభ‌కు గురి చేశార‌ని విజ‌య్ బాబు వాపోయారు. నిందితుల‌ను చ‌ట్ట‌ప‌రంగా శిక్షించాల‌ని స్థానిక సీఐ రమాకాంత్‌ను కోరారు. నిందితుల‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.

tags: journalists arrested, khammam, sathupally, print media, useless articles, muvva vijay babu, farmer dccb chairman,


Next Story

Most Viewed