కుటుంబ పార్టీలు పరిపాలించి దేశాన్ని విచ్ఛిన్నం చేశాయి: మాజీ కేంద్రమంత్రి

by Disha Web Desk 11 |
కుటుంబ పార్టీలు పరిపాలించి దేశాన్ని  విచ్ఛిన్నం  చేశాయి: మాజీ కేంద్రమంత్రి
X

దిశ, హిమాయత్ నగర్: 2014 ముందు కుటుంబ పార్టీలు పరిపాలించి దేశాన్ని విచ్ఛిన్నం చేశాయని మాజీ కేంద్రమంత్రి పరిశ్రమలు, వాణిజ్యం యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి (రాజస్థాన్ రాష్ట్రం) రాజవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. ఆదివారం నారాయణగూడ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సర్దార్ పటేల్ ఆడిటోరియంలో జరిగిన వికాసిత్ భారత్ అంబాసిడర్ల సమావేశంలో మంత్రి (రాజస్థాన్ రాష్ట్రం) రాజవర్ధన్ సింగ్ రాథోడ్ తో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజవర్ధన్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కుటుంబ పాలనను విచ్ఛిన్నం చేసింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పరివార్ కుటుంబాలు అనేక కుంభకోణాలతో దేశాన్ని విచ్చిన్నం చేశాయని ఆరోపించారు. కుటుంబ పార్టీలు నరేంద్ర మోడీ పరిపాలన చూసి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలతో సరసన ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు మ్యాప్ వేశారని.. 2047లో దేశం వికాసిత్ భారత్ గా విరజిల్లుతుందని అన్నారు.

యువతను దేశంలో భాగస్వామ్యం చేసేందుకు 25 ఏళ్లు దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిర్మాణం చేయాలని.. దేశ భవిష్యత్ కోసం మోదీ టార్గెట్ పెట్టుకున్నారని... దీని కోసం లక్షల మంది వద్ద అభిప్రాయాలు తీసుకున్నారని ఆయన తెలిపారు. ప్రపంచ దేశాలకు విశ్వగురువు తీర్చిదిద్దేందుకు నరేంద్రమోదీ లక్ష్యం పెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణలో ఉన్న యువత దీనిలో భాగస్వామ్యం కావాలని.. రాజకీయాలకు అతీతంగా ఈ వికాసిత్ భారత్ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న దీనికి కట్టుబడి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్వీపీ పార్లమెంట్ ఇంఛార్జి వీరెల్లి చంద్రశేఖర్, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్: అమరనాథ్ సారంగుల, తదితరులు పాల్గొన్నారు.



Next Story