అమిత్‌షా ఫేక్ వీడియో కేసు.. అరుణ్ రెడ్డికి బెయిల్

by Shamantha N |
అమిత్‌షా ఫేక్ వీడియో కేసు.. అరుణ్ రెడ్డికి బెయిల్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో నిందితుడు అరుణ్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ కోర్టు. అరుణ్ రెడ్డి దర్యాప్తునకు సహకరించారని.. తదుపరి కస్టడీ విచారణ అవసరంలేదని కోర్టు పేర్కొంది. నిందితుడు ఫేక్ వీడియో వైరల్ అయిన వాట్సాప్ గ్రూప్ 'అడ్మిన్' మాత్రమే అని తెలిపింది. నిందితుడు ఈ వీడియోను ఏ ఫోరంలలో పోస్ట్ లేదా సర్క్యూలేట్ చేసినట్లు ఆరోపణలు లేవని న్యాయమూర్తు వివరించారు. నిందితుడు మే 3 నుండి కస్టడీలో ఉన్నాడని, దర్యాప్తు సంస్థ ఇప్పటికే అతనిని పోలీసు రిమాండ్‌కు తీసుకుందని పేర్కొన్నారు. ఈ కేసులో ఇతర అనుమానితులకు తెలంగాణ హైకోర్టు రక్షణ కల్పించిందని ఢిల్లీ కోర్టు తెలిపారు.

విచారణలో అధికారులకు సహకరించాలని నిందితుడిని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. అతని మొబైల్ నంబర్ ను విచారణ అధికారులకు అందజేయాలని.. వారికి ఫోన్ ద్వారా అందుబాటులో ఉండాలని తెలిపింది. నిందితుడు కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఈకేసుకు సంబంధించి ఏ వ్యక్తిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎవరినీ బెదిరించవద్దని ఆదేశించింది.

అమిత్ షా ఫేక్ వీడియో కేసులో తెలంగాణకు చెందిన అరుణ్ రెడ్డిని మే 3న పోలీసులు అరెస్టు చేశారు. ఎక్స్‌లో ‘స్పిరిట్‌ ఆఫ్‌ కాంగ్రెస్‌’ ఖాతాను కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా జాతీయ కన్వీనర్‌ అరుణ్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. మే 3న రాత్రి ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్‌ ప్యూజన్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ ఆపరేషన్స్‌ అధికారులు అరెస్టు ఆయన్ని అరెస్టు చేశారు. అరుణ్ రెడ్డిపై అల్లర్లు సృష్టించడం, రెచ్చగొట్టడం, ఐటీ చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు.

Next Story