బీజేపీలో చేరడం పై క్లారిటీ ఇచ్చిన అరవిందర్ సింగ్ లవ్లీ

by Disha Web Desk 12 |
బీజేపీలో చేరడం పై క్లారిటీ ఇచ్చిన అరవిందర్ సింగ్ లవ్లీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జోరుగా సాగుతున్న క్రమంలో ఢిల్లీ కాంగ్రెస్ అధినేత అరవిందర్ సింగ్ లవ్లీ ఈరోజు రాజీనామా చేసి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం తో తీవ్ర అసహనానికి గురైన ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అరవిందర్ సింగ్ అతి త్వరలో బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన ఆయన.. బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన పుకార్లను కొట్టిపారేశాడు. అలాగే ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ సభ్యుడిగానే ఉన్నానని చెప్పుకొచ్చారు. అలాగే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది.. కేవలం అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ తో పొత్తు పట్ల అసమ్మతిని వ్యక్తం చేయడం మాత్రమేనని ఆయన చెప్పారు.



Next Story

Most Viewed