రోడ్టు మీదనే వాహనాల పార్కింగ్.. పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు

by Aamani |
రోడ్టు మీదనే వాహనాల పార్కింగ్.. పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు
X

దిశ,ఉప్పల్: ఉప్పల్ రింగ్ రోడ్డు చౌరస్తాలో ప్రైవేట్ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఉప్పల్ నుంచి హనుమకొండ కు ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లే ప్రైవేటు వాహనాలను ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఎదుట అడ్డూ అదుపు లేకుండా నడిరోడ్డుపై పార్కింగ్ చేసి ఉండడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని పాదాచారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీస్ అధికారులు చొరవ తీసుకొని ప్రైవేటు వాహనాలను రోడ్డు మీదనే పార్క్ చేయకుండా చూడాలని పాదాచారులు కోరుతున్నారు.

Next Story

Most Viewed