జుట్టు రాలకుండా ఇవి తినండి..!

by  |
జుట్టు రాలకుండా ఇవి తినండి..!
X

దిశ, వెబ్ డెస్క్ : జుట్టు ఊడిపోవడం చాలా మందిని బాధించే సమస్య ముఖ్యంగా వర్షాకాలంలో మరీ ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం బయోటిన్ లోపమే అంటున్నారు పోషకాహార నిపుణులు. కెరటిన్ అనే ప్రోటీన్ తోనే కేశాలు తయారవుతాయి. ఈ కెరటిన్ తయారీకి శరీరంలో బయోటిన్ అవసరం అవుతుంది.

అందుకే జుట్టు ఊడిపోయే వాళ్లకు బయోటిన్ సప్లిమెంట్ ఇస్తుంటారు వైద్యులు. అయితే వాటి కన్నా ‘ఈ’ విటమిన్ సహజంగా దొరికే గుడ్డుసొన, పుట్టగొడుగులు, క్యాలీఫ్లవర్, అరటిపండు, ఓట్స్, పాలకూర, ముడి ధాన్యాలు వంటి వాటి నుంచి తీసుకోవటమే ఉత్తమం అంటున్నారు నిపుణులు.


Next Story

Most Viewed