Brahmamudi: కవి మీద గృహహింస కేసు పెట్టిన అనామిక

by Disha Web Desk 10 |
Brahmamudi: కవి మీద గృహహింస కేసు పెట్టిన అనామిక
X

దిశ, సినిమా: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

ఇక పోలీస్ స్టేషన్‌లో అప్పూకి, కవి క్షమాపణలు చెబుతాడు. ‘నువ్వెందుకురా సారీ చెబుతున్నావ్? అయినా నువ్వు ఏం తప్పు చేయలేదు. అనామిక చేసిన తప్పుకి నువ్వేం చేస్తావ్?’ అంటుంది అప్పూ బాధగా. ‘నాకున్న బాధ ఒకటే అప్పూ.. ఇప్పుడు నీ మీద కేసు ఫైల్ అయితే.. అది నీ కెరీర్‌కే మచ్చ కదా.. అందులోనూ నువ్వు పోలీస్ అవ్వాలనుకుంటున్నావ్ కదా’ అంటూ బాధపడతాడు కవి. ఇంతలో అక్కడికి రాజ్, కావ్య వెళ్తారు. కవి, అప్పూలకు ధైర్యం చెప్పి.. ఎస్ఐ దగ్గరికి వెళ్తారు. ‘సార్ మనం ఇప్పుడు చేయలేమా?’అంటూ ఆరా తీస్తాడు రాజ్ పోలీస్‌తో.

‘అసలు కుదరదు సార్.. అనామిక గారు పెట్టింది మాములు కేస్ కాదు. గృహహింస కేస్. తను ఉండగానే అప్పూని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్లుగా కేసు పెట్టారు. దీనిలోంచి బయటికి రావడం చాలా కష్టం. అందుకే మీ గురించి ఆలోచించి ఇంకా ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. మీకు కష్టమైనా మీ మరదలని ఒప్పించి.. కేసు వెనక్కి తీసుకునేలా చెయ్యండి చాలు’ అని ఎస్ఐ అంటాడు. అదేలా సాధ్యం సార్.. అనామిక ఎవరి మాట వినదు? అని అంటాడు రాజ్. కావ్య వెంటనే.. సరే మేము చేసుకుంటామని ‘సాధ్యమే’ అని నమ్మకంగా అంటుంది. అనామిక అమ్మా నాన్నలను ఒప్పించడానికి.. రాజ్‌ని తీసుకుని వెళ్తుంది కావ్య. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Next Story

Most Viewed