వారితో శృంగారం చేస్తే పదేళ్ల జైలు శిక్ష: కోర్టు కీలక తీర్పు

by Disha Web Desk 9 |
వారితో శృంగారం చేస్తే పదేళ్ల జైలు శిక్ష: కోర్టు కీలక తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై సెషన్స్ కోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. మతిస్థిమితం లేని మహిళలతో శృంగారం చేస్తే అది అత్యాచారంగా పరిగణించబడుతుందని కోర్టు తీర్పునిచ్చింది. అలాంటి మహిళలతో శృంగారం చేస్తే నేరమని వెల్లడించింది. ఇలాంటి మహిళలు పర్యవసనాలను అర్థం చేసుకోలేరని కోర్టు పేర్కొంది. వివరాలు తెలియనప్పటికి పక్కింట్లో ఉండే ఓ కామాంధుడు(24) మతిస్థిమితం లేని మహిళ(23)తో శృంగారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఆమెకు ప్రెగ్నెన్సీ అయిన విషయం కూడా తెలియలేదు. కొద్ది రోజుల తర్వాత తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా.. తను గర్భవతి అని తేలింది. కాగా నిందితుడిపై కేసు పెట్టగా.. కోర్టు అతడిపై పదేళ్ల జైలు శిక్ష విధించింది.

Next Story