మీరు డయాబెటిసా…అయితే ఈ ఆహారం తీసుకోండి

by  |
మీరు డయాబెటిసా…అయితే ఈ ఆహారం తీసుకోండి
X

దిశ, వెబ్ డెస్క్:
వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్ద అందరికీ మధుమేహం వ్యాధి వస్తోంది. ఉరుకులు పరుగుల జీవితం, సమయ పాలన లేని ఆహారపు అలవాట్లే మధుమేహానికి దారి తీస్తున్నాయి. అయితే డయాబెటిస్ వ్యాధి బారిన పడిన వారు మెడిసిన్ తో పాటు సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. లేకుంటే శరీరంలోని షుగర్ లెవల్స్‌ను అదుపు చేయడం చాలా కష్టతరమైన పని. అందుకే డయాబెటిస్ పేషేంట్స్ ఏం డైట్ తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం….

డయాబెటిస్ తో బాధపడేవారు అన్ని రకాల ధాన్యాలను ఆహరంగా తీసుకుంటే మంచిది. అయితే బియ్యంతో చేసిన వంటకాలు తినకూడదనే చాలా మంది చెబుతుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. డయాబెటిస్ ఉన్న వారు అన్నం కూడా తినవచ్చు. అయితే ఎక్కువ మోతాదులో ఒకే సారి తినడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. దానికి బదులు తక్కువ మోతాదులో తీసుకోవాలని అంటున్నారు.

డయాబెటిస్ పేషేంట్లు అన్ని రకాల ఆకు కూరలను తీసుకోవచ్చు. ముఖ్యంగా పాలకూర వారి ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే దానిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారం తొందరగా జీర్ణం కాకుండా చూస్తుంది. అందువల్ల ఆహారంలో ఉండే షుగర్స్ ఒకే సారి రక్తంలో కలవకుండా ఉంటుంది. ఇక షుగర్ ఉన్న వారికి ఎక్కువగా కంటి సమస్యలు వస్తుంటాయి. అందుకే వారు ఎక్కువగా టమాటాలు తీసుకోవడం మంచింది. అలా చేస్తే టమాటాలోని విటమిన్ ఏ కంటి చూపును మెరుగు పరిచేలా చేస్తుంది.

డయాబెటిస్ పేషెంట్లు అధికంగా పప్పుదినుసులను తీసుకుంటే మంచిది. ఎందుకంటే మాంసహారంలో కన్నా ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ఫైబర్స్ కూడా ఉండటంతో ఇవి రక్తంలోని షుగర్ లెవల్స్ పెరగకుండా అదుపు చేస్తాయి.
ఇంకా ఒమేగా ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉన్న చేపలను తీసుకోవడం మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇక వారికి ఓట్స్ ఓ చక్కని ఆహారం. దీనిలో ఫైబర్స్ ఉంటాయి. ముఖ్యంగా ప్లెయిన్ ఓట్స్ ఇంకా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో చక్కెరలు తక్కువ ఉంటాయి. ఇంకా నెమ్మదిగా కూడా జీర్ణం అవుతుంది. బెర్రీస్‌ను కూడా అప్పుడప్పుడు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.


Next Story

Most Viewed