సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి కారణాలు ఇవే..!

by Vadlamudi Anukaran |   (  Updated:2023-06-13 16:28:58  IST  )

<p>దిశ, శేరిలింగంపల్లి: రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి సమీపంలో జరిగిన యాక్సిడెంట్‌లో మెగా హీరో సాయి ధరమ్‌తేజ్ తీవ్రగాయాల పాలు అయిన సంగతి తెలిసిందే. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కోహినూర్ హోటల్ సమీపంలోకి రాగానే రోడ్డు మీద ఇసుకలో స్పోర్ట్స్ బైక్ స్కిడ్ కావడంతో కొన్ని మీటర్ల దూరం వరకు సాయి ధరమ్ తేజ్ దూసుకుపోయాడు. దీంతో చాతి, కడుపు, కుడి కన్ను మీద గాయాలు అయ్యాయి. సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సమయంలో […]</p>

Mega hero Sai Dharam Tej
X

దిశ, శేరిలింగంపల్లి: రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి సమీపంలో జరిగిన యాక్సిడెంట్‌లో మెగా హీరో సాయి ధరమ్‌తేజ్ తీవ్రగాయాల పాలు అయిన సంగతి తెలిసిందే. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కోహినూర్ హోటల్ సమీపంలోకి రాగానే రోడ్డు మీద ఇసుకలో స్పోర్ట్స్ బైక్ స్కిడ్ కావడంతో కొన్ని మీటర్ల దూరం వరకు సాయి ధరమ్ తేజ్ దూసుకుపోయాడు. దీంతో చాతి, కడుపు, కుడి కన్ను మీద గాయాలు అయ్యాయి. సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సమయంలో బైక్ 120 స్పీడ్‌తో ఉన్నట్టు తెలుస్తోంది. అనంతరం గాయపడ్డ ఆయన్ను తొలుత మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో స్పృహలోకి తర్వాత.. మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇక ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గురైన స్పోర్ట్స్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Next Story