- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివాలయంలో చోరీ.. విగ్రహాలు మాయం..
<p>దిశ, కుత్బుల్లాపూర్ : స్థానిక శివాలయంలో దొంగలు పడ్డారు. ఆలయంలోని పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ మండలం సూరారం గ్రామం లక్ష్మీ నగర్‌లోని శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని ఆలయ పూజారి ఆదివారం సాయంత్రం ఎప్పటిలాగే మూసేసి వెళ్ళారు. మరుసటి రోజు (సోమవారం) ఉదయం వచ్చేసరికి గుడి తాళాలు ధ్వంసం చేసి ఉన్నాయి. దాంతో పూజారి, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. […]</p>

X
దిశ, కుత్బుల్లాపూర్ : స్థానిక శివాలయంలో దొంగలు పడ్డారు. ఆలయంలోని పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ మండలం సూరారం గ్రామం లక్ష్మీ నగర్‌లోని శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని ఆలయ పూజారి ఆదివారం సాయంత్రం ఎప్పటిలాగే మూసేసి వెళ్ళారు. మరుసటి రోజు (సోమవారం) ఉదయం వచ్చేసరికి గుడి తాళాలు ధ్వంసం చేసి ఉన్నాయి.
దాంతో పూజారి, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా 6 పంచలోహ విగ్రహాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే దొంగలు పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
- Tags
- Lord Shiva
Next Story






